అజ్ఞాతవాసి’కి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్స్!

Jérôme Salle legal notice  - Agnyaathavaasi.jpgపవన్ కల్యాణ్ తాజా చిత్రం ‘అజ్ఞాతవాసి’ కథ తాను తీసిన లార్గో వించ్ చిత్రానికి కాపీయేనని గతంలో ఆరోపించిన ఫ్రెంచ్ దర్శకుడు జెరోమ్ సాలీ, మరోసారి తెరపైకి వచ్చారు. సినిమా విడుదలై వారం రోజులు దాటినా, తన ఆరోపణలపై స్పందన రాలేదని ఆరోపించిన ఆయన, ఇక చర్యలు తీసుకోవడం ఒక్కటే తన ముందున్న మార్గమని, లీగల్ నోటీసులు పంపనున్నానని స్పష్టం చేశారు.

ADVERTISEMENT

“కాపీ కొట్టకుండా క్రియేటివిటీతో సినిమాలు తీయగల సత్తా భారతీయ చిత్ర పరిశ్రమకు ఉందనే భావిస్తున్నాను. అయితే, గత వారం రోజులుగా ‘అజ్ఞాతవాసి’ టీమ్ నుంచి మౌనమే సమాధానమైంది. ఇక చట్టపరమైన చర్యలకు దిగనున్నా” అని జెరోమ్ సాలీ తన ట్విట్టర్ ఖాతాలో హెచ్చరించారు. దీంతో ‘అజ్ఞాతవాసి’ టీంకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్ అయినట్లే భావించవచ్చు.

ADVERTISEMENT
Latest Stories