ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో వేచిన తరుణం వచ్చేసింది

Jr NTR - Mevaru Meelo Koteeswarudu

ఇప్పటివరకు స్టార్ మా లో టెలికాస్ట్ చెయ్యబడిన పాపులర్ క్విజ్ షో మీలో ఎవరు కోటీశ్వరులు ఇప్పుడు జెమినీ టీవీకి మారింది. జెమినీ టీవిలో ఈ షో ఎవరు మీలో కోటీశ్వరులు అనే పేరుతో టెలికాస్ట్ అవ్వబోతుంది. స్టార్ మా లో ఈ షోను నాగార్జున, చిరంజీవి హోస్ట్ చెయ్యగా… ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చెయ్యబోతున్నారు.

ADVERTISEMENT

ఈ కార్యక్రమానికి సంబంధించిన అధికారిక ప్రకటన రేపు హైదరాబాద్ లో జరగబోతుంది. హైటెక్ సిటీలోని ఒక స్టార్ హోటల్ లో దీని ప్రకటన ఉంటుంది. ఈ షో ఎప్పటి నుండి ప్రసారం కాబోతుంది అనేది రేపు ప్రకటిస్తారు. గతంలో బిగ్ బాస్ మొదటి సీజన్ హోస్ట్ చేసిన ఎన్టీఆర్ ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు.

అయితే ఆ తరువాతి సీజన్లు హోస్ట్ చెయ్యడం కుదరలేదు. దీనితో అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. పైగా ఎన్టీఆర్ ని తెరమీద చూసి చాలా కాలం అయిపోయింది రాజమౌళి పుణ్యమా అని… ఆ కోరిక కూడా ఈ షోతో తీరుతుంది. ఆర్ఆర్ఆర్ అక్టోబర్ 13న దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

సంక్రాంతికి వాయిదా పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ తరుణంలో ఈ షో అనేది ఎన్టీఆర్ అభిమానుల పాలిట వరం. ఈ షో కు నాగార్జున కు చాలా మంచి పేరు వచ్చింది. అయితే చిరంజీవి మాత్రం నప్పక బాడ్ నేమ్ వచ్చింది. దానితో ఎన్టీఆర్ ఎలా చెయ్యబోతున్నాడు అనేది కూడా చూడాలి.

ADVERTISEMENT
Latest Stories