అప్పటి నుండి ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ మొదలుపెట్టబోతున్నారా?

Jr NTR - Ram Charan - Rajamouli - RRRమెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య అత్యంత భారీగా నిర్మిస్తున్న ఈ సినిమాపై టాలీవుడ్ సహా దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమాకు కీలకమైన సన్నివేశాలు రామోజీ ఫిలిం సిటీలో షూట్ చేస్తున్నారు. అల్లూరి సీతారాజు గా రామ్ చరణ్ బ్రిటిష్ జడ్జీల ముందు తన వాదనలు వినిపిస్తున్న సీన్లు తీస్తున్నారు. ఇది ఇలా ఉండగా కొత్త సంవత్సరం సందర్భంగా సినిమా ప్రమోషన్స్ మొదలు పెడతారని వార్తలు వస్తున్నాయి.

ADVERTISEMENT

జనవరి ఒకటిన సినిమా టైటిల్ ప్రకటిస్తారట. రఘుపతి రాఘవ రాజారాం, రామ రౌద్ర రుషితం అనే పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సహజంగా రాజమౌళీ ఇటువంటి రూమర్లను కాదని కొత్త వి ప్రకటిస్తూ ఉంటారు. చూడాలి ఏం జరగబోతుంది అనేది.

ఆర్ఆర్ఆర్ వచ్చే ఏడాది జులై 30న విడుదల చేస్తామని చివరిగా నిర్మాతలు ప్రకటించారు. అయితే వచ్చే ఏడాది దసరాకు గానీ ఆ పై ఏడాది సంక్రాంతికి గానీ సినిమా వాయిదా పడొచ్చని వార్తలు వస్తున్నాయి. మొన్న ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో రామ్ చరణ్ ఈ వార్తలను ఖండించారు. అనుకున్న ప్రకారమే సినిమా షూటింగ్ జరుగుతుందన్నారు.

ADVERTISEMENT
Latest Stories