Juliet Lover of Idiot Theatrical Trailerధియేటిరికల్ ట్రైలర్ అనేది ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ లో అత్యంత కీలకమైన అంశం అనే చెప్పాలి. ట్రైలర్ బాగుంటే… చిన్న సినిమాకు కూడా ఓపెనింగ్స్ అదిరిపోతుండగా… అదే ట్రైలర్ నిరాశపరిచేలా ఉంటే… భారీ బడ్జెట్ మూవీ అయినా కుదేలుకావాల్సిందే అన్న విషయాన్ని చాలా చిత్రాలు ఇప్పటికే నిరూపించాయి. మరి తాజాగా విడుదలైన “జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్” ధియేటిరికల్ ట్రైలర్ ఎలా ఉంది?

‘అందాల రాక్షసి’ ఫేం నవీన్ చంద్ర హీరోగా నటించిన ఈ సినిమాలో హిట్ సినిమాల హీరోయిన్ నివేదా థామస్ హీరోయిన్ గా నటించడం విశేషం. రెండు నిముషాల నిడివి గల ఈ ట్రైలర్ లో చూపించాల్సిన దాని కంటే ఎక్కువ చూపించేసారని చెప్పవచ్చు. టైటిల్ కు తగ్గట్లే… ఓ ఇడియట్ ప్రేమలో జూలియట్ పడగా, ఆ తర్వాత జరిగే కధ, కమామీషు అంతా తెలుగు ప్రేక్షకుల ఊహలకు అందని విధంగా అయితే ఉండదు.

నిజానికి ఈ ట్రైలర్ ను సరిగ్గా కట్ చేస్తే ప్రేక్షకులకు ఒకింత ఎట్రాక్ట్ చేసే అవకాశముంది. కానీ అంత షార్ప్ గా కట్ చేయడంలో చిత్ర యూనిట్ విఫలమైందని చెప్పవచ్చు. రెండు నిముషాలు చూపించినా… అందులోనూ ఏ మాత్రం కొత్తదనం దర్శనమివ్వకపోవడం అత్యంత నిరుత్సాహకరమైన అంశం. ఈ ట్రైలర్ వలన సినిమాకు కలిగే ఉపయోగం కంటే నిరుపయోగమే ఎక్కువని చెప్పాలి.