
గడిచిన ఏడాది కాలంగా చూస్కుంటే భారత క్రికెట్ జట్టు ఒక టీ-20 ప్రపంచ కప్ ను గెలుచుకున్నప్పటికీ, ఆ ఫామ్ ను కేవలం పొట్టి ఫార్మటుకే అంకితం చేశారు జట్టు ఆటగాళ్లు. అటు వన్ డేల్లో చూసుకున్నా, ఇటు టెస్ట్ లలో చూసుకున్న, సీనియర్ల నుండి చెప్పుకోదగ్గ ప్రదర్శనలు కనిపించడం లేదు.
ఇటు టీ-20 ల విషయానికి వస్తే విరాట్, రోహిత్, జడ్డు వంటి సీనియర్లు ఈ ఫార్మటు కు గుడ్ బాయ్ చెప్పటంతో, జట్టు అంతా యువ రక్తంతో కదులుతుంది. ఆ యువ రక్తం అపోజిషన్ తో సంబంధం లేకుండా ఆడుతున్న ప్రతి సిరీస్ లో వార్ వన్ సైడ్ చేసేస్తున్నారు. వరల్డ్ కప్ తరువాతే ఇప్పటికి 4 సిరీస్ లు ఆడగా అన్నింట్లోనూ విజయభేరి మోగించారు కుర్రాళ్ళు.
Also Read – వైసీపీ వైరస్ కి జైలే వాక్సిన్..?
వారు ఏదో అదృష్టవశాత్తు విజయాలను అందుకోవడం లేదు, వారి నైపుణ్యం మరియు సామర్ధ్యంతో ఓటమి అంచుల వరుకు వెళ్లిన మ్యాచ్ లను కూడా పోరాటపటిమతో హక్కు గా తిరిగి విజయ దారుల్లో నడుస్తున్నారు. అభిషేక్, తిలక్, సంజు, నితీష్, జైస్వాల్ వంటి వారు ఒంటి చేతులతో మ్యాచ్లను భారత్ కు అనుకూలంగా మలుస్తూ గెలిపించి పెడుతున్నారు.
మరి భారత టి-20 జట్టు ఇంత ఘనమైన విజయాలను అందుకుంటుంటే, అటు భారత సీనియర్లు తమ ఫామ్ ను కోల్పోయి, నెటిజన్స్ చేత విమర్శలు ఎదుర్కుంటున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి బడా ఆటగాళ్లు గత కొంత కాలంగా ఫామ్ లేమి తో అనేక విమర్శశలు ఎదుర్కొంటూనే ఉన్నారు. మొన్న నితీష్ రెడ్డి బ్యాట్ తో రెచ్చిపోయి ప్రత్యర్థికి చుక్కలు చూపిస్తే, నేడు అభిషేక్ శర్మ ఇంగ్లాండ్ బౌలర్స్ ను చితక్కొట్టి తన సత్తా చాటారు.
Also Read – రాహుల్ “లీగల్లీ కన్వెర్టడ్ ఇండియన్”.?
దీనితో జూనియర్స్ బ్యాటింగ్ వేట సీనియర్స్ కు ప్రాణ సంకటంగా మారిందనే చెప్పాలి. అయితే ఇటు చూస్తే కుర్రాళ్ళు ఇంత ఘనమైన విజయాలతో ముందుకు పోతున్నారు, మరోపక్క మన సీనియర్లు సిరీస్ పై సిరీస్ ను చేజార్చుకుని, టెస్ట్ ఛాంపియన్షిప్ నుండి మొట్టమొదటి సారి వైదొలిగారు. చూడాలి మరి, రానున్న రోజుల్లో సీనియర్లు తమ ఒత్తిడిని అధిగమించి తిరిగి తమ సత్తా చాటుకుంటారా..?