
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరేడు నెలల వరకు కూడా కాకినాడ పోర్టు నుంచి యధేచ్చగా రేషన్ బియ్యం ఆఫ్రికా దేశాలను ఎగుమతి అవుతుండేది. ఈవిషయం నాదెండ్ల మనోహర్ ఎన్నికల ప్రచార సమయంలోనే బయటపెట్టారు.
ఆయన పౌరసరఫరాల శాఖ మంత్రి పదవి చేపట్టిన వెంటనే కాకినాడ పోర్టుకి తరచూ వెళ్ళి అక్కడి నుంచి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియాన్ని పట్టుకుంటూనే ఉన్నారు.
Also Read – సలహాదారులంటే వీరు కదా..
ఆ తర్వాత డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళి రేషన్ బియ్యం తీసుకుపోతున్న స్టెల్లా షిప్పుని వెనక్కు రప్పించారు.
ఆ సందర్భంగా ఆయన ‘సీజ్ ది షిప్’ అనే మాట పట్టుకొని రేషన్ బియ్యం దొంగలే ఆయనతో, కూటమి ప్రభుత్వంతో ఓ ఆటాడుకున్నారు.
Also Read – ఏపీ ప్రోగ్రాస్ రిపోర్ట్
ఈ అక్రమ రవాణాకు అనుబందంగా మొదలైన కాకినాడ పోర్టు కబ్జా కధ ముగిసింది. మాజీ మంత్రి పేర్ని నాని గోదాములలో రేషన్ బియ్యం మాయమైన కేసు ఇంకా సాగుతోందో అటకెక్కిపోయిందో తెలీదు. కానీ తాజాగా కాకినాడ పోర్టుకి వచ్చిన నాలుగు లారీలలో సుమారు 92 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం పట్టుబడింది. అంటే ‘సీజ్ ది షిప్’ స్టోరీ కూడా ముగిసిపోయిన్నట్లే అనుకోవాలా?
రేషన్ బియ్యం అక్రమ రవాణా విషయంలో మూడు ప్రశ్నలకు కూటమి ప్రభుత్వం జవాబు చెప్పాల్సి ఉంది.
Also Read – రచ్చ గెలిచేసాడు.. మరి ఇంట..?
1. కూటమి ప్రభుత్వమే ఇప్పుడు అధికారంలో ఉన్నా నేటికీ రేషన్ బియ్యం కాకినాడ పోర్టు నుంచి ఎలా ఎగుమతి అవుతోంది?
2. నేటికీ కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం ఎగుమతికి వస్తోందంటే ఆనాడు అంత హడావుడి చేసిన డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ ఏం చేస్తున్నారు?
3. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో పేదలకు చేరాల్సిన రేషన్ బియ్యం లారీలలో కాకినాడ పోర్టుకి వస్తోందంటే ఇంటి దొంగలు ఎవరో గుర్తించలేని పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందా?లేదా గుర్తించినా వారిపై చర్యలు తీసుకోలేని నిసహాయ స్థితిలో ఉందా?