Kalvakuntla Kavitha About Maintaining Pink Book

నారా లోకేష్‌ ఏ ముహూర్తంలో ‘రెడ్‌బుక్‌’ కనిపెట్టారో కానీ ఇప్పుడు అన్ని రాష్ట్రాలలో, అన్ని పార్టీలు అటువంటి బుక్కులు మెయిన్‌టెయిన్ చేయడం అవసరమని ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. గమ్మత్తైన విషయం ఏమిటంటే, మనమూ ఓ ‘రెడ్‌బుక్‌’ మెయిన్‌టెయిన్ చేద్దామని చెపుతున్నవారే ‘రెడ్‌బుక్‌ రాజ్యాంగం’ అమలుచేయడం తప్పని విమర్శిస్తున్నారు.

రాష్ట్రంలో వైసీపీ నేతలందరూ తలో ‘బ్లూబుక్‌’ మెయిన్‌టెయిన్ చేయాలని జగన్‌ చెపుతుంటే, తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా ‘పింక్ బుక్’ మెయిన్‌టెయిన్ చేయాలని ఆ పార్టీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ సూచించారు.

Also Read – ప్రధాని పర్యటనపై వైసీపీ సైలంట్.. అంతేగా అంతేగా!

బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, పార్టీ నేతలు, కార్యకర్తలని ఉద్దేశించి మాట్లాడుతూ, “ఎవరూ కాంగ్రెస్‌ నేతల వేధింపులకు భయపడాల్సిన పనిలేదు. కేసీఆర్‌ సార్ చాలా మంచోడు కానీ నేను కాస్త రౌడీ టైపే. కనుక తప్పకుండా పింక్ బుక్ పెట్టి మనల్ని ఇబ్బందిపెడుతున్న ప్రతీ ఒక్క కాంగ్రెస్‌ నేత పేరు వ్రాస్తున్నాను. మనం అధికారంలోకి వచ్చాక బరాబర్‌ వాళ్ళందరిపై తగిన చర్యలు తీసుకుందాము,” అని అన్నారు.

ముఖ్యమంత్రులుగా చేసిన కేసీఆర్‌, జగన్‌ ప్రజాస్వామ్యాన్ని గౌరవించకుండా, ప్రతిపక్షాలను ఉక్కుపాదంతో అణచివేసి తమ అధికారానికి ఎదురులేకుండా చేసుకోవాలనుకున్నారు. అందువల్లే ‘రెడ్‌బుక్‌’ పుట్టింది.

Also Read – ఇటు అమరావతి…అటు విశాఖ…!

కానీ ఆ పేరుతో రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడితే భవిష్యత్‌లో తాము కూడా అటువంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందనే ఆలోచన వల్ల కావచ్చు లేదా ప్రజాస్వామ్యానికి కట్టుబడి ప్రతిపక్షాలని ఎదుర్కోవడమే మంచి పద్దతని సిఎం చంద్రబాబు నాయుడు గట్టిగా నమ్మడం వలన కావచ్చు చాలా కాలంపాటు ‘రెడ్‌బుక్‌’ బయటకు తీయనీయలేదు. కానీ కూటమి ప్రభుత్వం తమపై చర్యలు తీసుకో(లే)కపోవడమే వైసీపీ నేతలకు అలుసుగా అనిపించి రెచ్చిపోతున్నారు. కనుక సిఎం చంద్రబాబు నాయుడు కూడా వారిని ఎంత మాత్రం ఉపేక్షించలేని పరిస్థితి వారే కల్పించారు.

తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక సమస్యలతో సతమతమవుతోంది. కనుక బిఆర్ఎస్ పార్టీతో రాజకీయ-కబాడీ ఆడేందుకు ఆసక్తి చూపడం లేదు. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్ రావులపై అనేక కేసులలో విచారణలు జరిపించినప్పటికీ, ఇంతవరకు వారిలో ఏ ఒక్కరినీ సిఎం రేవంత్ రెడ్డి అరెస్ట్‌ చేయించలేదు.

Also Read – పాకిస్థాన్‌కు ఓ యుద్ధం కావాలి.. భారత్‌ చేస్తుందా?


కనుక ఇక్కడ వైసీపీకి సిఎం చంద్రబాబు నాయుడు అలుసుగా కనపడి రెచ్చిపోయిన్నట్లే, అక్కడా బిఆర్ఎస్ నేతలకు సిఎం రేవంత్ రెడ్డి అలుసుగా భావించి రెచ్చిపోతున్నారు. కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా వారిని ఉపేక్షించలేని పరిస్థితి కల్పించి చేజేతులా సమస్యలు సృష్టించుకుంటున్నారు.