తమిళనాడులోని అన్ని రాజకీయ పక్షాల కంటే ఇటీవలే రాజకీయరంగేట్రం చేసిన కమల్ హాస్సన్ ఫాస్ట్ గా ఉన్నారు. ఆయన కాసేపటి క్రితం కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితో భేటీ అయ్యారు. కావేరీ నదీజలాల వివాదంపై చర్చించేందుకు ముఖ్యమంత్రితో భేటీ అయినట్లు కమల్ హాసన్ తెలిపారు.
కావేరీ నదిజలాల విషయంలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రితో కమల్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. జయలలిత మరణానంతరం తమిళ రాజకీయాలలో ఒకరకమైన స్తబ్దత ఏర్పడింది. అయితే ఏ ఒక్క రాజకీయ పక్షం చురుకుగా వ్యవహరించడం లేదు.
ఈ సమయంలో కమల్ ఒక అడుగు ముందుకు వేసిన కర్ణాటక ముఖ్యమంత్రితో భేటీ కావడం మెచ్చుకోదగిన విషయం. మరోవైపు తాజాగా తూత్తుకుడిని సందర్శించిన రజనీకాంత్ కావేరీ నదీజలాలపై చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో పెనుదుమారం రేపాయి. అయితే రజనీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆయన నటించిన కాలా చిత్రాన్ని కర్ణాటకలో రిలీజ్ కాకుండా అడ్డుకుంటామని కొంతమంది నిరసనకారులు ప్రకటించారు.



