రైల్వే జోన్ సరైన సమయంలో సరైన నిర్ణయం అన్నారంటే

Kambhampati Haribabu responds on AP railway zoneఏపీకి కేంద్ర సాయంపై ఏపీ భాజపా అధ్యక్షుడు, విశాఖ ఎంపీ హరిబాబు మరో 18 పేజీల నోట్ శుక్రవారం ఢిల్లీలో విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడంతోనే ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందుతోందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సంధర్భంగా ఆయన రైల్వే జోన్ పై ఆసక్తికరమైన మాట అన్నారు.

ADVERTISEMENT

విశాఖకు రైల్వేజోన్‌పై రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కన్నారు. సహజంగా రాజకీయ నాయకులు ఏదైనా ఏదైనా విషయం పక్కన పెట్టాలంటే వాడే మాట – సరైన సమయంలో సరైన నిర్ణయం. ఒకపక్క మార్చి 5 నుండి మొదలవ్వబోయే బడ్జెట్ సమావేశాలలోపే రైల్వే జోన్ ప్రకటిస్తారని అంతా ఆసక్తిగా వేచిచూస్తున్నారు.

ఈ తరుణంలో ఇలాంటి మాట అన్నారంటే మళ్ళీ మాట మార్చబోతున్నారా? మరోవైపు రైల్వే జోన్ విశాఖపట్నం కేంద్రంగా కాకుండా విజయవాడ కేంద్రంగా తెచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయని పుకార్లు షికారు చేస్తున్నాయి. దీనిపై ఇప్పటికే ఉత్తరాంధ్ర ప్రజానీకం ఆగ్రహంగా ఉంది.

ADVERTISEMENT
Latest Stories