Kanna-Lakshminarayana-Ambati-Rambabuగుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గానికి మంత్రి అంబటి రాంబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన తన సాగునీటి పారుదల శాఖలో జరుగుతున్న పనుల గురించి మాట్లాడరు కానీ నిత్యం చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ల గురించి వెటకారంగా మాట్లాడుతుంటారు.

ఏటా సంక్రాంతి వస్తే చాలు… మంత్రిగారు సంబరాల రాంబాబుగా మారిపోయి సత్తెనపల్లిలో లాటరీలు నిర్వహిస్తూ, రోడ్ల మీద చిందేసి డ్యాన్సులు చేస్తుంటారు.

Also Read – గంట అరగంట వీరులకు అర్దమైంది కానీ దువ్వాడకు అర్ధం కాలే.. అందుకే..

మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఈవిదంగా చవుకబారుగా మాట్లాడుతుండటం, వ్యవహరిస్తుండటం వలన వైసీపీ ప్రభుత్వం నవ్వులపాలవుతోందని తెలిసి ఉన్నప్పటికీ, సిఎం జగన్మోహన్ రెడ్డి ఆయనను గాడిన పెట్టకపోవడం విస్మయం కలిగిస్తుంది.

అయితే టిడిపి ఆయనకు సరైన వ్యక్తిని తగిలించింది. సత్తెన్నపల్లి నియోజకవర్గానికి కన్నా లక్ష్మినారాయణను ఇన్‌ఛార్జ్‌గా నియమించింది. తద్వారా సత్తెనపల్లి నుంచి అంబటి రాంబాబుపై ఆయన పోటీ చేయడం ఖరారు అయ్యింది.

Also Read – జగన్‌తో సహవాసం.. ముగింపు ఇలాగే!

కన్నా లక్ష్మినారాయణకు నియోజకవర్గంపై మంచి పట్టుంది కానీ ఇదివరకు శాసనసభ స్పీకర్‌గా వ్యవహరించిన స్వర్గీయ కోడెల శివప్రసాదరావు, తర్వాత మంత్రిగా అంబటి రాంబాబు నియోజకవర్గంపై పట్టు సాధించడంతో కన్నా లక్ష్మినారాయణ కాస్త వెనకబడిపోయారు. ఇంతకాలం బిజెపిలో ఉండిపోవడం కూడా ఆయన రాజకీయ ఎదుగుదలకి అవరోధంగా మారింది. కానీ ఇప్పుడు టిడిపి తరపున సత్తెనపల్లి నుంచి పోటీ చేసేందుకు చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చేయడంతో, అంబటి రాంబాబుకి గట్టి పోటీ ఇవ్వనున్నారు.

నిజానికి సత్తెనపల్లి నుంచి కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరాం పోటీ చేయాలనుకొంటున్నారు. కానీ అంబటి రాంబాబువంటి శక్తివంతుడైన ప్రత్యర్ధిని ఎదుర్కొని ఓడించాలంటే, కన్నా లక్ష్మినారాయణ వంటి మంచి అనుభవం ఉన్న వ్యక్తికి మాత్రమే సాధ్యం. కనుక కోడెల శివప్రసాదరావు కుమారుడుకి వేరే నియోజకవర్గంలో సీటు కేటాయించాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు.

Also Read – ఇక దువ్వాడ జీవితం మాధుర్యమే


ఇంతకాలం అంబటి రాంబాబు ఓ ఎమ్మెల్యేగా సత్తెనపల్లి నియోజకవర్గానికి, మంత్రిగా రాష్ట్రానికి ఏమీ చేయకుండా ఆడుతూ పాడుతూ గడిపేశారు. కానీ ఇప్పుడు కన్నా లక్ష్మినారాయణ బరిలో దిగుతున్నారు కనుక ఆయనే రాంబాబు చేత ఇంకా బాగా డ్యాన్స్ చేయిస్తారు.