కాకినాడ ఎఫెక్ట్: మీడియాపై ముద్రగడ అసహనం

Kapu Community  Leader Mudragada Padmanabham blames Mediaకాకినాడ మునిసిపల్ ఎలెక్షన్స్లో తెదేపా ఘనవిజయం సాధించింది. ముద్రగడ సొంత జిల్లా కావడం, కాపు ఉద్యమానికి వేదికైన కూడా కాకినాడలో ఘన విజయం సాధించడం తెదేపాకు కలిసి వచ్చింది. కాపుల మీద ముద్రగడ ఎఫెక్ట్ లేదని తేల్చి చెప్పినట్టు అయ్యిందని పాలకవర్గం చెప్పుకొస్తుంది.

దీనివల్లే ఏమో మీడియా ముద్రగడను పట్టించుకోవడం మానేసిండట. ప్రతి వారం ప్రభుత్వం పై ఏదో ఒక కామెంట్ చేస్తున్న అందుకు తగ్గ కవరేజ్ రావడం లేదని ముద్రగడ భావన. పత్రికలు, టీవీలు కూడా ఒక సామాజికవర్గానికి చెందిన వ్యక్తుల వార్తలకే ప్రాధాన్యం ఇస్తున్నాయని ఆరోపించారు.

ADVERTISEMENT

” విమర్శించేవారి వార్తలు పెద్దవిగా రాసి, నేను చెప్పిన విషయాలను రాసేందుకు పుస్తకాలు, పెన్నులు లేవన్నట్టుగా ” అని పత్రికలపై ఆయన ధ్వజమెత్తారు. డిసెంబరు 6వ తేదీలోగా కాపులను బీసీల్లో చేర్చని పక్షంలో తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

ADVERTISEMENT
Latest Stories