గమనిక: తెలంగాణలో రాజకీయ శూన్యత ఉంది!

Kavitha Telangana Politics

అవును. తెలంగాణలో రాజకీయ శూన్యత ఉందట! ఈ విషయం కల్వకుంట్ల కవిత కనిపెట్టి చెప్పారు. గతంలో ఆమె తండ్రి కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపి, టీడీపిలతో సహా మరే పార్టీ లేకుండా తుడిచిపెట్టేసే ప్రయత్నం చేశారు.

అప్పుడు అవి దాదాపు ఉనికి కోల్పోయే ప్రమాదంలో ఉండగా బీఆర్ఎస్‌ పార్టీ ఒక్కటే సర్వశక్తివంతమైన పార్టీగా నిలిచింది. కనుక అప్పుడు తెలంగాణలో నిజంగానే రాజకీయ శూన్యత ఏర్పడింది. కానీ అప్పుడు ఆమె అదే బీఆర్ఎస్‌ పార్టీలో ఉన్నందున ఆ రాజకీయ శూన్యత కనిపించలేదు.

ADVERTISEMENT

కానీ ఇప్పుడు ఆ పార్టీలో నుంచి బయటకొచ్చేసి సొంత పార్టీ పెట్టుకోవాలని అనుకుంటున్నారు. కనుక ఆమె పెట్టుకున్న జాగృతి కళ్ళద్దాలలో నుంచి చూస్తున్నప్పుడు రాష్ట్రంలో రాజకీయ శూన్యత కనిపిస్తోంది.

కానీ వాస్తవానికి కాంగ్రెస్‌, బీజేపిలు కేసీఆర్‌ ధాటిని తట్టుకొని నిలబడటమే కాదు… శాసనసభ. లోక్‌సభ ఎన్నికలలో ఓడించి ఫామ్‌హౌసులో కూర్చోబెట్టాయి కూడా.

ఆ కారణంగా బీఆర్ఎస్‌ పార్టీ చాలా బలహీనపడినప్పటికీ ఇప్పుడు జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలలో ఆ రెండు పార్టీలకు చాలా గట్టి పోటీ ఇస్తోంది. ఇది తమ అంతిమ పోరన్నట్లు మూడు పార్టీలు హోరాహోరీగా పోరాడుకుంటున్నాయి. కూడా. ఇవి కాక వామపక్షాలు, మజ్లీస్, ఇంకా కొన్ని కొత్త పార్టీలు కూడా ఉన్నాయి. కనుక తెలంగాణలో రాజకీయ శూన్యత లేదని స్పష్టంగా కనిపిస్తోంది.

కానీ నాలుగు నెలల్లో ‘జాగృతి జనం బాట’ ముగించుకున్న తర్వాత సొంత పార్టీ పెట్టుకోవాలని కల్వకుంట్ల కవిత అనుకుంటున్నారు. కనుక తెలంగాణ రాజకీయ ఎడారిలా కనిపిస్తోంది. కానీ ఆమె వంటివారికి ఈ రాజకీయ ఎడారిలో ఒయాసిస్సులు ఉన్నట్లు భ్రమ కలుగవచ్చు కానీ అవి ఎండమావులే కావచ్చు. కనుక ఆ శూన్యంలోకి ప్రవేశించకపోవడమే మంచిది. అది బ్లాక్ హోల్ కూడా కావచ్చు!

ADVERTISEMENT
Latest Stories