తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రూటే సపరేటు. ఆయన చెప్పే మాటలు.. చేసే పనులు కూడా అలాగే ఉంటాయి. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం కూడా సంచలనమైంది. తన విచక్షణ నిధిగా ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించుకున్నారు కేసీఆర్.
ADVERTISEMENT
సిఎం ఆయా ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ఇచ్చే హామీలు నెరవేర్చడానికి, ఇతరత్రా ప్రజలకు అవసరమైన నిధులు ఇవ్వడానికి సిఎం కేసీఆర్ ఖాతాలో ఐదు వేల కోట్ల రూపాయలు అట్టేపెట్టాలని నిర్ణయించారు. ఇలాగే మంత్రులకు ఒక్కొక్కరికి పాతిక కోట్లు చొప్పున ఇవ్వాలని కూడా తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది.
ADVERTISEMENT



