జాతీయ రాజకీయాలలో బిఆర్ఎస్ దారెటు?

KCR-BRS

తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలో ప్రవేశించేందుకు చేస్తున్న ప్రయత్నాల గురించి అందరికీ తెలుసు.

మహారాష్ట్రలో బిఆర్ఎస్ పార్టీని విస్తరించినప్పటికీ తెలంగాణ ఎన్నికలలో గెలిచి ఉండి ఉంటే అక్కడా కేసీఆర్‌ నాయకత్వం పట్ల ప్రజలకు, పార్టీ నేతలకు నమ్మకం ఏర్పడి ఉండేది.

ADVERTISEMENT

కానీ సొంత రాష్ట్రంలోనే ఓడిపోయి ముఖ్యమంత్రి పదవి కోల్పోవడంతో ఇది వరకులా ఇతర రాష్ట్రాలలో ధాటిగా మాట్లాడలేని ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. తెలంగాణలో కాంగ్రెస్‌ గెలుపుకి టిడిపి పరోక్షంగా సహకరించినందున, సిఎం రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కూడా ఏపీలో టిడిపి అధికారంలోకి వచ్చేందుకు తోడ్పడవచ్చు.

గత ఏపీ శాసనసభ ఎన్నికలలో వైసీపిని గెలిపించి జగన్‌ను ముఖ్యమంత్రి చేసినందునే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందనే భావన ఏపీ ప్రజలలో బలంగా ఉండి. కనుక ఏపీలో అడుగుపెట్టడం కష్టమే.

దేశంలో ప్రాంతీయ పార్టీలన్నీ కాంగ్రెస్‌ లేదా బీజేపీతో కలిసి సాగుతున్నాయి. కేసీఆర్‌ ఈ వాస్తవాన్ని అంగీకరించకుండా కాంగ్రెస్‌, బీజేపీలకు సమానదూరం పాటించాలనుకోవడం వలన జాతీయ రాజకీయాలలో ఒంటరిగా మిగిలిపోయారు.

ప్రాంతీయ పార్టీలతో పొత్తులు, మద్దతు లేకుండా కేవలం రైతులను, గ్రామ సర్పంచ్‌లను నమ్ముకొని జాతీయ రాజకీయాలలో దూసుకుపోవచ్చనుకోవడం దురాశే అవుతుంది.

ఇక బిఆర్ఎస్ నేతలు ఒప్పుకొన్నా ఒప్పుకోకపోయినా బీజేపీతో రహస్య అవగాహన ఉందనే విషయం శాసనసభ ఎన్నికల సమయంలోనే బయటపడింది. కానీ ఇంతకాలం బీజేపీ, ప్రధాని నరేంద్రమోడీలను విమర్శిస్తూ, ఎద్దేవా చేస్తూ మళ్ళీ వారి పంచన చేరాలని ప్రయత్నిస్తే తెలంగాణ ప్రజలే కాదు యావత్ దేశ ప్రజలు కూడా నవ్వుతారు.

అలాగని రాష్ట్రంలో తన అధికారాన్నిలాకొన్న కాంగ్రెస్‌ పార్టీతో కూడా చేతులు కలపలేరు. కనుక ఒకవేళ కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలో ముందుకు సాగాలనుకొంటే ఒంటరి ప్రయాణం తప్పదు.

వద్దనుకొంటే ఏదో కారణం చెప్పుకొని బీజేపీతో బహిరంగంగా పొత్తులు పెట్టుకొని దానితో కలిసి ముందుకు సాగాల్సి ఉంటుంది. కానీ అందుకు బీజేపీ ఒప్పుకొంటుందా?

ADVERTISEMENT
Latest Stories