విమర్శిస్తే జైలుకే …. కేసీఆర్ కొత్త రూల్!

KCR passes new ruleతెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక ప్రమాదకర నిర్ణయానికి శ్రీకారం చుట్టారు. ఎదుటివారిని దూషించినా, అభ్యంతరకరంగా మాట్లాడినా, పోలీసులు ఎవరి అనుమతి లేకుండానే కేసు పెట్టవచ్చట. ఇప్పటివరకు కోర్టు అనుమతితోనే కేసు పెట్టాలి. అయితే ఇప్పుడు ఆ అవసరం లేదు. ప్రభుత్వం అవసరం అనుకుంటే అనుమతి తీసుకోవచ్చు, తీసుకోకుండా కూడా ముందుకు పోవొచ్చు.

ADVERTISEMENT

దీనికి సంబందించిన పైల్ పై మంగళవారం ముఖ్యమంత్రి సంతకం చేశారు. రాజకీయంగా కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వంటివారు కెసిఆర్ తీవ్రంగా దూషించే పరిణామంలో ఇబ్బంది పడొచ్చు. విమర్శలు చేసినా, అవినీతి ఆరోపణలు చేసినా వారిని జైలుకు పంపే అవకాశం కనిపిస్తుంది. దీనితో ప్రతిపక్షాలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

కోర్టు అనుమతి లేకుండానే పోలీసులు కేసు పెట్టవచ్చని కెసిఆర్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమే కాకుండా ప్రమాదకరమైనది పరిణమించనుంది. ప్రతిపక్షాన్ని నియంత్రించడానికి తెచ్చినట్టుగా ఉంది. గతంలో అనేక మారులు ప్రభుత్వంపై రుజువులు లేకుండా విమర్శలు చేస్తే కేసులు పెడతాం అని హెచ్చరించారు.

ఆయన అన్నట్టుగానే చేసినట్టుగా కనిపిస్తుంది. మరోవైపు ఈ రూల్ ప్రకారం కేసులు పెట్టాల్సివస్తే ముందు పెట్టాల్సిందే కేసీఆర్ మీదేఅని ఆయన వాడినటువంటి అభ్యంతరకర బాషా ఇది వరకు ఎప్పుడు తెలుగు రాజకీయాలలో ఎవరు వాడలేదని బీజేపీ నేత కిషన్ రెడ్డి అన్నారు. అయితే ఏలిన వారి మీద కేసులు పెట్టే ధైర్యం ఎవరికి ఉంటుంది?

ADVERTISEMENT
Latest Stories