కేసీఆర్ తో కేశవ్ నిజంగానే మాట్లాడకూడనిది ఏదో మాట్లాడారా?

kcr payyavula keshav secret meetingఅనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తో పయ్యావుల కేశవ్ తో ఏకాంతంగా మాట్లాడటం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. టిడిపి తెలంగాణ నేతలు దీనిపై అభ్యంతరం చెప్పడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తప్పుపట్టారు. సీనియర్‌ నాయకుడు, పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయనే ఇలా చేస్తే ఎలా?

ADVERTISEMENT

తెలంగాణలో తెదేపా ఉందని, ఇలాంటి చర్యల వల్ల పార్టీకి ఇబ్బంది ఏర్పడుతుందని మర్చిపోతే ఎలా? అని చంద్రబాబు అన్నట్టు సమాచారం. పరిటాల శ్రీరామ్ పెళ్లికి తాను కూడా అతిధిగానే వెళ్లానని, కెసిఆర్ కనిపిస్తే ,నమస్కారం పెట్టి వెళ్లిపోతే, ఒక పోలీసు అదికారి ద్వారా తనకు కబురు చేశారని,దాంతో ఆయన వద్దకు వెళ్లానని కేశవ్ వివరించారు. పిలిచిన వెళ్లకపోతే మర్యాద కాదని వెళ్ళ అనేది కేశవ్ వాదన.

ఐతే చంద్రబాబు ఈ మాత్రం దానికే అంత సీరీయస్ అయ్యరంటే నిజంగానే పయ్యావుల కేశవ్ కేసీఆర్ తో మాట్లాడకూడనిది ఏదో మాట్లాడారా? అని అందరి అనుమానం. ఐన కేసీఆర్ కు కేశవ్కు అంత సీక్రెట్లు ఏమీ ఉంటాయి? వారి మధ్య జరిగిన సంభాషణ పై చంద్రబాబుకు ఏమన్నా నిఘావర్గాల సమాచారం ఉందా?

ADVERTISEMENT
Latest Stories