ఇదేమి పబ్లిసిటీ పిచ్చి కేసీఆర్?

KCR Advertisement in Karnataka, Kerala and Tamilnaduతెలంగాణ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు కార్యక్రమాన్ని జనవరి 1 నుండి ప్రారంభించింది. ఈ స్కీం వల్ల వచ్చే లాభనష్టాలు ఎలా ఉన్న రైతులకు మంచి చెయ్యాలనే తాపత్రయాన్ని మెచ్చుకోవలసిందే. అది ఓటు బ్యాంకు రాజకీయమైన అన్నదాతలు లాభపడితే హర్షించాల్సిందే.

అయితే ఈ స్కీం ను ప్రభుత్వం పబ్లిసిటీ చేసుకోవడంలో కొంత అత్యుత్సాహం చూపిస్తుందని అనుకోవాల్సిందే. ప్రతి దిన పత్రిక మొదటి పేజీ యాడ్ ఇచ్చారు సరే. ఇలాంటి యాడ్లే ఆంధ్ర దినపత్రికలలో కూడా ఇచ్చారు. సరే ఇద్దరు చంద్రులు రాజకీయ ప్రత్యర్ధులు కదా అనుకుని సరిపెట్టుకోవచ్చు.

ADVERTISEMENT

అయితే దీనికి సంబందించిన యాడ్లు కేరళ, కర్ణాటక వంటి వేరే రాష్ట్రాలలో ఎందుకు వేస్తున్నారో అర్ధం కాదు. కోట్లు తగలేసి ఇలా ప్రకటనలు మానేసి అదే డబ్బు రైతులకు ఖర్చు పెట్టవచ్చు. అది కాకుండా ఈ పబ్లిసిటీ పిచ్చి ఏంటో అర్ధం కాదు. మాకేమిలే? మిగులు బడ్జెట్ తో ఉన్నాం అనుకుంటే సరిపోదు.

కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి అనే సామెత భాషాప్రవీణుడైన కేసీఆర్ కు తెలియనిది కాదు. రైతులకు అది చేసాం ఇది చేసాం అని ఎన్ని రకాలుగా చెప్పుకున్నా రైతుల ఆత్మహత్యలలో తెలంగాణా ఇప్పటికి దేశంలో రెండో స్థానంలో ఉందని పాలకులు గుర్తుంచుకుంటే మంచిది.

ADVERTISEMENT
Latest Stories