పూజలు,యాగాలు,హోమాలు, దైవ చింతన కేసీఆర్ కు కాస్త ఎక్కువే అన్న సంగతి తెలిసిందే. గడిచిన కొన్నేళ్లుగా తన ఫామ్ హౌస్ లో నిర్వహిస్తున్న చండీయాగంను ఈ రోజు ఉదయం బ్రహ్మ ముహూర్త సమయంలో మొదలుపెట్టారు కేసీఆర్ దంపతులు.
విశాఖపట్నం శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆధ్వర్యంలో ఈ యాగం ప్రారంభించబడింది. మూడు రోజులు పాటు సాగే ఈ కార్యక్రమంలో రాజశ్యామల అమ్మవారు,చండి అమ్మవార్లతో పాటు మరికొంతమంది దేవతామూర్తులను పూజించనున్నారు.
సంకల్పంతో యాగం మొదలుపెట్టిన పండితులు రేపు వేదపఠనాలతో ఆఖరి రోజు పూర్ణాహుతితో యాగాన్ని పరిసమాప్తం యనున్నారు.అధికారం రావడానికి, శత్రువుల బలం తగ్గడానికి రాజశ్యామల యాగం చేస్తారంటూ పండితులు చెపుతున్నారు.ఐతే రానున్న ఎన్నికలలో మరోసారి రాష్ట్రంలో పార్టీని అధికారంలో నిలపడానికి కేసీఆర్ యాగాలను నమ్ముకుంటే మేము ప్రజలను నమ్ముకున్నాం అంటున్నారు ప్రతిపక్ష పార్టీల నేతలు.
గతంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా శారద పీఠం అధిపతులు నిర్వహించిన రాజశ్యామల యాగంలో పాల్గొనడం జరిగింది. రాజకీయ నాయకులకు ‘యాగాలు రాజయోగానికి మార్గాలుగా మారాయా’ అన్న సందేహం ప్రజలలో కలుగుతుంది. గతంలో రాజకీయాలలో ఇటువంటి ఆచారాలు కనిపించేవి కావు కానీ మారుతున్న పరిణామాలను బట్టి రాజకీయ నాయకులు కూడా అటు ప్రజలు తాయిలాలు ఇటు దేవునికి హోమాలు చేస్తూ తమ రాజకీయాన్ని ముందుకు నడిపిస్తున్నారు.ఈ రాజశ్యామల యాగంతో కేసీఆర్ తిరిగి రాజ్యాధికారం పొందితే ఇక ఈయాగానికి మహర్దశ పెట్టినట్టే.




