తెలంగాణాలో కుటుంబ పాలనా సాగుతుందని మనం తరచు వినే విమర్శ. ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్ ఇప్పటికే అరడజన్ శాఖలకు మంత్రిగా ఉన్నారు. దాదాపుగా ఆయనే ముఖ్యమంత్రా అన్నట్టు రాజకీయాలు సాగుతున్నాయి. కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు మరొక కీలక మంత్రి. ఆయన కూతురు కవిత ఎంపీగా ఉన్నారు.
ఇప్పుడు తాజాగా కేసీఆర్ సమీప బందువు , టిఆర్ఎస్ లో కీలక పాత్ర పోషిస్తున్న సంతోష్ కు రాజ్యసభ సీటు దక్కవచ్చని సమాచారం. వచ్చే రాజ్యసభ ఎన్నికలలో టిఆర్ఎస్ కు మూడు సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్,టిడిపిలకు చెందినవారితో పాటు పాతిక మంది ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లోకి పిరాయించడంతో టిఆర్ఎస్ కు మూడు సీట్లు వచ్చే అవకాశం ఏర్పడింది.
ప్రస్తుతం ఎంపీలుగా ఉన్న రాపోలు ఆనంద భాస్కర్, సి.ఎమ్.రమేష్ ల పదవీకాలం వచ్చే ఏప్రిల్ లో ముగుస్తుంది.మరో సభ్యుడు పాల్వాయి గోవర్దనరెడ్డి మరణించారు. ఈ మూడు స్థానాలు తెరాసకే దక్కబోతున్నాయి. ప్రస్తుతం టిఆర్ఎస్ కు ముగ్గురు ఎమ్.పిలు రాజ్యసభలో ఉన్నారు. ఈ ముగ్గురితో వీరి సంఖ్య ఆరుకు పెరుగుతుంది.



