రెండు తెలుగు రాష్ట్రాలలో విచిత్రమైన రాజకీయ పరిస్థితిలు ఉన్నట్టు కనపడుతున్నాయి. కేంద్రం రెండు రాష్ట్రాలకు మొండి చెయ్యి చూబిస్తున్న ఎవరు మాట్లాడని పరిస్థితి. మిత్రధర్మం అంటూ చంద్రబాబు మాట్లాడారు, కేసులకు భయపడి జగన్ మాట్లాడలేరు. మరోవైపు తెలంగాణలో కూడా విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్ర సమితిలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు మోడీని నియంత అని పిలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు బడ్జెట్ మీద ఒక మాట కూడా మాట్లాడని పరిస్థితి. ఆర్ధికమంత్రి ఈటెల రాజేంద్ర తెలంగాణకు వచ్చిందేమీ లేదుగానీ బడ్జెట్ మెరుగ్గా ఉందని రైతులకు, ఆరోగ్యానికి పెద్దపీట వేశారని చెప్పుకొచ్చారు.
మరోవైపు కేసీఆర్ మేనల్లుడు, మంత్రి హరీష్ రావు మాత్రం మోదీ సర్కార్ మాటలు ఘనంగా ఉంటాయని.. చేతల్లో మాత్రం శూన్యమని విమర్శించారు. కేంద్రం గ్రామీణ ప్రాంత ప్రజలు, రైతుల పట్ల చిన్నచూపు ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. గుజరాత్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇంకా దారికిరాలేదని చురకలు అంటించారు.



