తెలంగాణ పాలిట దేవత సోనియా గాంధీ అని ఒక నాడు కేసీఆర్ కీర్తించారు. కుటుంబ సమేతంగా వెళ్ళి ఆమెకు థాంక్స్ చెప్పి వచ్చారు. అయితే అదంతా గతం ఇప్పుడసలు కాంగ్రెస్ పాత్ర ఏమీ లేదు. కేసీఆర్ పోరాటం వల్ల ఇంక ఏమి చెయ్యలేని పరిస్థితిలో కాంగ్రెస్ ఇచ్చింది తప్ప ఇందులో సోనియా గొప్ప ఏమీ లేదని చెబుతున్నారు గులాబీ దళం.
[m9ad]
అంతే కాకా తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్ర లేదని చెప్పడం అంటే భారత స్వాతంత్య్రోద్యమంలో గాంధీ, నెహ్రూ, సుభాష్‌చంద్రబోస్ వంటి వారల పాత్ర లేదని చెప్పడమే. తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చింది అని చెప్పడం అంటే దేశానికి స్వాతం త్య్రం తెల్లోళ్లు ఇచ్చారని చెప్పడమే. అవును భారత దేశానికి స్వాతంత్య్రం ఇవ్వడానికి కూడా బ్రిటన్ పార్లమెంటు చట్టం చేయాల్సి వచ్చింది.
తెలంగాణకు స్వపరిపాలన ఇవ్వడానికి కూడా భారత పార్లమెంటు చట్టం చేయా ల్సి వచ్చింది. అప్పుడు తెల్లోళ్లయినా, మొన్న కాంగ్రెస్ అయినా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకతప్పని పరిస్థితి అనే వాదనను కాంగ్రెస్ ను కౌంటరు చెయ్యడానికి తెర మీదకు తెచ్చారు. దీనిని కేటీఆర్ విరివిగా ప్రజలలోకి తీసుకెళ్తున్నారు.
తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ తమకు ఇవ్వకపోవడం ఒక ఎత్తు అయితే తమను బ్రిటిష్ వారితో పోల్చడం కాంగ్రెస్ వారికి మింగుడు పడటం లేదు. పైగా దీనికోసమే ఆంధ్రప్రదేశ్ ను ఆ పార్టీ పూర్తిగా త్యాగం చేసింది కూడా. ఇప్పుడు అక్కడ కనీసం గుప్పెడు సీట్లలో డిపాజిట్ కూడా తెచుకోలేని పరిస్థితి. పాపం కాంగ్రెస్…!!



