టీడీపీ నాయకుడు టార్గెట్ గా మీడియాలో ఎవరైనా విమర్శలు చేసినా, అవినీతి ఆరోపణలు గుప్పించినా అది వైసీపీ కి ఒక పెద్ద రాజకీయ అవకాశంగా మారుతుంది. అందునా ఆ విమర్శలు కూడా టీడీపీ పార్టీ నేతల నుంచే వచ్చాయంటే ఇక వైసీపీ కి దసరా, దీపావళి రెండు కలిపి వచ్చినట్టే.
ఇప్పుడు అటువంటి పండుగనే కొలికపూడి వైసీపీ పార్టీకి వరంగా ఇచ్చారు. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని పై విమర్శలు చేస్తూ ఆయన పార్టీ టికెట్లు అమ్ముకున్నాడంటూ బహిరంగా ఆరోపణలు చేసారు. ఇక వైసీపీ కి సాక్షి వంటి నీలి మీడియాకు అంతకు మించిన ఆహారం ఏముంటుంది.?
దొరికిందే సందు అన్నట్టుగా పేర్ని నాని రంగంలోకి దిగారు. కొలికిపూడి ఒక తరహా ఆరోపణలు చేస్తే పేర్ని నాని మరో అంశంలో కేశినేని చిన్ని పై విమర్శలకు దిగారు. గొడుగు పేట వెంకటేశ్వర స్వామి ఆస్తి పై చిన్ని కన్ను పడిందని, దేవుని ఆస్తుల జోలికి వస్తే చిన్ని పతనం ఖాయమంటూ శాపాలు పెట్టారు.
అయితే పేర్ని నాని మాటలలో వాస్తవం ఎంత అనేది ప్రభుత్వం విచారించి చర్యలు తీసుకోవాల్సిన అంశం. అయితే కేశినేని చిన్ని పై వచ్చిన విమర్శలకు ప్రతి స్పందంగా వైసీపీ నుంచి కేశినేని నాని రంగంలోకి దిగుతారు అనుకుంటే అనూహ్యంగా పేర్ని నాని రంగ ప్రవేశం చేసారు.
చిన్ని ఓటమే తన లక్ష్యం, చిన్ని రాజకీయ పతనమే తన ధ్యేయం అన్నట్టుగా 2024 ఎన్నికల బరిలో దిగిన ఈ కేశినేని బ్రదర్స్ రాజకీయ పోరు రాష్ట్ర వ్యాప్తంగా రసవత్తరంగా సాగిందింది. అయితే తమ్ముడు చేతిలో పరాభవానికి గురైన నాని రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా అంటూ ప్రకటించినపప్టికి చిన్ని విషయంలో మాత్రం రాజకీయం చేస్తూనే ఉన్నారు.
మరి ఇప్పుడు చిన్ని పేరు మీడియాలో ఈ విధంగా నానుతున్న వైసీపీ మాత్రం చిన్ని పైకి నాని ని ఇంకా ఎక్కుపెట్టలేదు. అయితే గతంలో కూడా చిన్ని పై తారాస్థాయిలో రాజకీయ విమర్శలు చేసిన కేశినేని నాని ఆ ఆరోపణలకు తగిన ఆధారాలు చూపలేకపోయారు
ఈ కారణమే నాని ని మీడియాలోకి రానివ్వడం లేదా.? ఈసారి కూడా ఇలా నిరాధారమైన ఆరోపణలు చేసి ప్రజలలో పలుచనివ్వడం ఎందుకులే అనే భావనలో నాని ఉన్నారా.? లేకపోతే నాని తిరిగి టీడీపీ కి దగ్గరవ్వాలని చూస్తున్నారా.?




