విజయవాడ మునిసిపల్ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి, అమరావతి భవిష్యత్తుకు కీలకం. స్థానిక ఎన్నికలలో అధికార పక్షానికి అనుకూలంగా ఉండటం సహజమే… అమరావతి ఇష్యూ కారణంగా… అలానే టీడీపీకు సంస్థాగతంగా ఉన్న బలం కారణంగా విజయవాడలో గెలవడం అనేది కొంత ఈజీ. అయితే నేతల మధ్య ఉన్న విబేధాల కారణంగా దానిని చేజార్చుకునేలా ఉన్నారు.
ఎంపీ కేశినేని నాని… బోండా ఉమా + బుద్ధా వెంకన్న రెండు వర్గాలుగా చీలిపోయారు. రెండు వర్గాలు విజయవాడ మేయర్ పీఠం కోసం కొట్టుకోవడం తో పార్టీ అధిష్టానం కేశినేని కుమార్తె వైపే మొగ్గుచూపి అధికారికంగా ప్రకటించారు. మూడు రోజులలో ఎన్నికల ఉన్నాయనగా కేశినేని నాని వ్యతిరేక వర్గం సమావేశం అయ్యింది.
ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా నివాసంలో సమావేశమైన నేతలు… ఎంపీ నానిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాము కావాలో కేశినేని కావాలో తేల్చుకోవాలని అల్టిమేటం జరీ చేశారు. విజయవాడ టీడీపీ తానే అధిష్ఠానమని కేశినేని మాట్లాడడం ఆయన అహంకారానికి నిదర్శనమని, కుమార్తెను మేయర్ ని చెయ్యడం కోసం కులాల మధ్య కుంపట్లు పెడుతున్నారని బోండా ఉమా మీడియాతో అన్నారు.
మరోవైపు.. కేశినేని నానిని ఆరోజే చెప్పుతో కొట్టేవాడిని.. చంద్రబాబు మీద గౌరవంతో వదిలేశానన్నారు బుద్ధా వెంకన్న అన్నారు. ఏది ఏమైనా పరిస్థితిని బట్టి విజయవాడ నాయకులు కలిసి పని చేసే పరిస్థితి లేదని అర్ధం అవుతుంది. ఈ ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ గెలిస్తే… విజయవాడలోనే అమరావతి సెంటిమెంట్ లేదని అధికార పక్షం చెప్తాది. అందుకు టీడీపీ నాయకులు తమను తామే నింధించుకోవాల్సి ఉంటుంది.





