యూ ట్యూబ్ స్టార్ గా వెలుగొంది, టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పై సక్సెస్ ఫుల్ కెరీర్ ను ప్రారంభించిన రాజ్ తరుణ్, మధ్యలో ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ సినిమా సడెన్ బ్రేక్ వేసినా, ‘ఈడో రకం ఆడో రకం’ సినిమాతో మళ్ళీ పుంజుకుని, తాజాగా “కిట్టు ఉన్నాడు జాగ్రత్త” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఫస్ట్ టీజర్ నుండే ఆసక్తికరంగా సాగిన ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా విడుదల చేసారు.
ప్రేక్షకులకు ‘పక్కా ఎంటర్టైన్మెంట్’ పంచేందుకు ఈ కిట్టు గాడు సిద్ధమయ్యాడన్న నమ్మకాన్ని ధియేటిరికల్ కలిగించింది. ముఖ్యంగా ఈ కిట్టు గాడి కధను ఈ ట్రైలర్ కటింగ్ తోనే చెప్పిన తీరు వీక్షకులను ఆకట్టుకుంటుంది. కొత్తదనం లేక రొటీన్ గా ఉన్నప్పటికీ సినిమాపై పాజిటివ్ ఫీల్ ను కలిగేలా చేయడంలో ట్రైలర్ సక్సెస్ అయ్యింది. తాజ్ తరుణ్ సరసన నటించిన ‘మజ్ను’ ఫేం అను ఇమానుయేల్ లుక్ కూడా ఫ్రెష్ నెస్ ను తీసుకువచ్చింది.
ఇక, చాలాకాలం తర్వాత మళ్ళీ టాలీవుడ్ స్క్రీన్ పైన సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ విలన్ గా దర్శనమిస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి ‘జై చిరంజీవ’ సినిమాలో విలన్ పాత్ర పోషించినప్పటికీ, ఆ సినిమా ఫెయిల్యూర్ కావడంతో అవకాశాలు లేకపోయిన అర్భాజ్ ఖాన్, మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత తెలుగు తెరపైకి ఎంట్రీ ఇచ్చారు. ఈ ఏడాది ప్రారంభం నుండి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతుండగా, దానిని కొనసాగించే విధంగా ఈ కిట్టు గాడు రెడీ అయ్యాడన్న సంకేతాలు కనపడుతున్నాయి.



