మహాకూటమిలో సీట్ల పంపకంపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి కొంత క్లారిటీ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. టీడీపీతో 14 సీట్లకు అంగీకారం కుదిరిందని.. తెజస, సీపీఐతో సీట్ల సర్దుబాటుపై చర్చలు కొనసాగుతున్నాయని ఉత్తమ్ చెప్పారు. మొత్తం 95 స్థానాల్లో కాంగ్రెస్ బరిలో ఉంటుందని, మిగతా 24 స్థానాల్లో మిత్రపక్షాలు పోటీ చేస్తాయన్నారు.
[m9ad]
దీనిబట్టి కోదండరాం పార్టీ, సిపిఐకు కలిపి కేవలం 10 స్థానాలు మాత్రమే కాంగ్రెస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దీనికి కోదండరాం ఎలా స్పందిస్తారో చూడాలి. అవసరమైతే ఒంటరిగా వెళ్ళడానికి కూడా సిద్ధమని ఇప్పటికే కోదండరాం బెదిరిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. టీడీపీకూడా కనీసం 18 సీట్లు అడుగుతునట్టు సమాచారం. కోదండరాం కనీసం 12 సీట్లు అడుగుతున్నట్టు సమాచారం.
ఏదో పోటీ చెయ్యడం కోసం సీట్లు అడగడం కాకుండా గెలిచే అవకాశాన్ని బట్టే సీట్లు అడగాలని ఉత్తమ్‌కుమార్ రెడ్డి మిత్రపక్షాలకు హితవు పలికారు. మరోవైపు కాంగ్రెస్ ఈరోజు తన మొదటి లిస్టు విడుదల చేస్తుంది అని భావించినా అలా చేస్తే మిత్రులతో ఇబ్బంది రావొచ్చని, సీట్ల పంపకం పూర్తి అయ్యాకనే ప్రకటించాలని పార్టీ నిర్ణయించినట్టు సమాచారం. దాని ప్రకారం ఈ నెల 8న లేదా 9న అభ్యర్థుల జాబితా విడుదల అయ్యే అవకాశం ఉంది.



