కోడికత్తి కేసు కూడా చంద్రబాబు నాయుడు మెడకే?

Kodi Kathi Caseటిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై తనకు ఎటువంటి ద్వేషం, రాజకీయకక్ష లేవంటూనే ‘నెల రోజులుగా చంద్రబాబు నాయుడు జైల్లోనే తిరుగుతున్నారంటూ’ సిఎం జగన్‌ సంతోషపడుతున్నట్లు చెప్పడం గమనిస్తే చంద్రబాబు నాయుడుపై ఆయన ఎంత పగ ప్రతీకారాలతో రగిలిపోతున్నారో అర్దంచేసుకోవచ్చు.

కోడికత్తి కేసుపై విచారణ జరిపిన జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ), కోర్టు దీనిలో ఎటువంటి రాజకీయ కుట్రలేదని నిర్ధారించినా రాజకీయ కుట్ర జరిగిందని వాదిస్తూ జగన్‌ హైకోర్టుని ఆశ్రయించడం గమనిస్తే ఈ కేసును కూడా చంద్రబాబు నాయుడు మెడకే చుట్టే ఆలోచనలో ఉన్నారేమో అనే అనుమానం కలుగుతోంది.

ADVERTISEMENT

ఇటువంటి క్రిమినల్ కేసులో బాధితులు తమకు ఎవరిపై అనుమానం ఉందో విచారణ అధికారులకి తెలియజేస్తారు. తదనుగుణంగా వారు దర్యాప్తు జరిపి కోర్టుకి నివేదిస్తారు. అప్పుడు కోర్టు నిందితులను విచారించి నిజానిజాలు తెలుస్తుంది. కానీ ఈ కోడికత్తి కేసులో జగన్‌ ఎన్నడూ విచారణకి హాజరుకాలేదు. తనపై ఈ కుట్రకు పాల్పడింది ఎవరో చెప్పడం లేదు. కానీ కుట్ర జరిగిందని ఆరోపిస్తున్నారు. అందుకే దీనిని కూడా వ్యూహాత్మక కేసుగా నడిపిస్తున్నారేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రస్తుతం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌, టిడిపి నేతలపై వరుసపెట్టి నమోదు చేస్తున్న కేసులన్నిటినీ కూడా ఇలాగే ఎన్నికల వరకు కమిటీలు, దర్యాప్తు అంటూ సాగదీసిన సంగతి తెలిసిందే. ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు ముందుగా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జైలుకి పంపించింది. తర్వాత నారా లోకేష్‌ని, ఆ తర్వాత టిడిపి ముఖ్యనేతలందరినీ జైల్లో వేస్తామని మంత్రో రోజా స్వయంగా చెప్పారు.

అంటే ఇవన్నీ అవినీతి కేసులనడం కంటే రాజకీయకక్షతోనే వ్యూహాత్మకంగా దాఖలు చేస్తున్న కేసులని అర్దమవుతోంది. కనుక కోడికత్తి కేసును కూడా చంద్రబాబు నాయుడు మెడకే చుట్టేందుకే ఈ కేసును ముగించకుండా ఇంతవరకు సాగదీసుకు వస్తున్నారా? అనే అనుమానం కలుగుతోంది. ఈ అనుమానం నిజమా కాదా అనేది రాబోయే రోజుల్లో బయటపడుతుంది.

ADVERTISEMENT
Latest Stories