పవన్ కళ్యాణ్ పూనమ్ కౌర్ మీద కత్తి మహేష్ చేసిన విమర్శలు సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. వారి మధ్య ఏదో నడుస్తుందని అందుకే ఆమెను పవన్ కళ్యాణ్ రికమెండ్ చేసి ఆంధ్రప్రదేశ్ కు చేనేత అంబాసిడర్ గా నియమింపచేశారని మహేష్ కత్తి ఆరోపించారు. అయితే అప్పటి ఏపీ చేనేత మంత్రి కొల్లు రవీంద్ర దీనిని ఖండించారు.
అసలు చేనేత అంబాసిడర్ వంటిది ఏమి లేదని, అలాంటి నియామకమే జరగలేదని ఆయన చెప్పుకొచ్చారు. గత అప్పటిలో మీడియా ముఖంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ విషయం అనౌన్స్ చేసిన మాట అందరికి తెలిసిందే. కాకపోతే దానికి సంబందించిన అధికారిక ఉత్తరువులు రాలేదట.
కాబట్టి ఆమె నియామకం అధికారికంగా ఖరారు కానట్టే. మారోవైపు ఒక టీవీ ఛానల్ తో మాట్లాడుతూ ఆమె సోదరుడు శ్యామ్ సింగ్ కత్తి మహేష్ మీద కేసు పెడతామని హెచ్చరించారు. మూడు సంవత్సరాలుగా తన సోదరి చేనేతను ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చెయ్యడానికి కష్టపడుతుందని దానిని గుర్తించి చంద్రబాబు నాయుడు ఆమెను ఆంధ్ర ప్రదేశ్ చేనేత అంబాసిడర్ గా చేసారని ఆయన చెప్పుకొచ్చారు



