ABN రాధాకృష్ణకు కోమటిరెడ్డి వార్నింగ్…

Komatireddy targets ABN Radhakrishna

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆక్రోశం సొంత పార్టీ నేతలను దాటి మీడియా వరకు వ్యాపించిందా అన్నట్టుగా రాజగోపాల్ ABN ఆంధ్రజ్యోతి రాధా కృష్ణ పై రెచ్చిపోయారు. మీడియా కు కూడా ప్రాంతీయత అంటగడుతూ ఆంధ్రా మీడియా తెలంగాణ మీడియా అంటూ మీడియా ఛానెల్స్ కు సరిహద్దులు ఉంటాయంటూ హెచ్చరించారు.

ABN ఛానెల్ ఎవరికీ సపోర్ట్ చేస్తుంది, రాధాకృష్ణ ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మంచిది, లేకుంటే నీకు మర్యాద ఉండదు, ఆంధ్రా మీడియా ఛానెళ్లు మా గురించి వార్తలు రాసే ముందు, మీడియా ముసుగులో రాజకీయ విశ్లేషణలు చేసే ముందు చూసుకుని రాయాలని, లేకుంటే పరిస్థితులు బాగుండవంటూ హెచ్చరించారు రాజగోపాల్.

ADVERTISEMENT

అలాగే మేము తలచుకుంటే తెలంగాణలో మీ మీడియా ఛానెల్ ఉండదని, అసలైన కాంగ్రెస్ పార్టీ వారసులం తామే అంటూ రెచ్చిపోయారు రాజగోపాల్ రెడ్డి. అయితే అసలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి ABN రాధాకృష్ణకు మధ్య వివాదం రేగడానికి గల కారణాలేమిటి.? అసలు రాజగోపాల్ కు వ్యతిరేకంగా ABN లో వచ్చిన ఆ వార్తలేమిటి.? రాజకీయ విశ్లేషణలు ఏమిటి అనేది ఇక్కడ ఆసక్తిగా మారింది.

అయితే రాజగోపాల్ ఇస్తున్న ఈ స్వీట్ వార్నింగ్ కి ABN రాధాకృష్ణ నుంచి వచ్చే కౌంటర్ ఏంటనేది కూడా ఇక్కడ హాట్ టాపిక్ గా మారింది. అయితే రాజకీయాలలో ఉండే నేతలు ఇలా మీడియా ను కూడా ఒక ప్రాంతానికి పరిమితం చేసి రాష్ట్రం విడిపోయిన పదేళ్ల తరువాత కూడా మీరు ఆంధ్రా – మేము తెలంగాణ అంటూ ప్రాంతీయవాద రాజకీయాలు చేయడం ఎంతవరకు సమంజసం.

అసలు రాజగోపాల్ ఆక్రోశం రేవంత్ తనను మంత్రి వర్గంలోకి తీసుకోనందుకా.? లేక ABN తనకు వ్యతిరేకంగా వార్తా కథనాలు ప్రచారం చేస్తుందనా.? లేదా ABN రాధాకృష్ణకు సీఎం రేవంత్ కి మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయనా.?

కొందరు వ్యక్తుల కోసం పనిచేస్తూ వారిని బలపర్చడానికి తమ లాంటి నిజాయితీ గల వారిని బలహీనపరుస్తున్నారని అటువంటి కథనాలు ABN ఆంధ్రజ్యోతి లో ప్రచారం అవుతున్నాయని, మాకు ఆంధ్రా పత్రికలు, ఆంధ్రా మీడియా అవసరం లేదని తాము తలచుకుంటే ABN వంటి ఛానెల్స్ వంద పెడతామంటూ రాజగోపాల్ రాధాకృష్ణ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు.

అయితే రాజగోపాల్ ఆవేశానికి ABN రాధాకృష్ణ వీకెండ్ కామెంట్ వరకు వేచి ఉంటుందా.? లేదా ఇప్పుడే పని మొదలుపెడుతుందా.? ఇటు ఏపీలో వైసీపీ అటు తెలంగాణ లో బిఆర్ఎస్ ఇప్పటికే ABN పై విరుచుకుపడుతున్న ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నుంచి ABN కు ఇటువంటి వార్నింగ్ లు రాధాకృష్ణ పై ఎటువంటి ప్రభావం చూపుతుందో చూడాలి..!

ADVERTISEMENT
Latest Stories