మహేష్ బాబు ‘బంగారం’ అన్న టాప్ రచయిత!

Kona-Venkat about mahesh babuప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న హీరోలు బహుళ అంశాల్లో ప్రావీణ్యం గల వారు. దీంతో తాము నటించే సినిమాలలో కేవలం తన పాత్ర గురించే కాకుండా, ఇతర విషయాల్లో కూడా జోక్యం చేసుకోవడం ఎక్కువైపోయింది. ఇది ఈనాటిది కాకపోయినా… రానూ రానూ ఆ ఉధృతి పెరుగుతూ పోతుండడంతో… కక్కలేక మింగలేక అన్నట్లుగా సినీ వర్గాలు మిన్నకుండిపోతున్నారు. అయితే ఇప్పటికే టాలీవుడ్ లో ఓ స్థాయిలో ఉన్న కోన వెంకట్ వంటి రచయితలైతే ఇలాంటి వాటిని బహిరంగంగానే వెల్లడిస్తున్నారు.

అందులో భాగంగానే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో… తన ఆవేదనను వెలిబుచ్చాడు. “ఇతరుల పనుల్లో వేలు పెట్టే విషయంలో మాత్రం మహేష్ బంగారం అని, ఇంకొకళ్ళ పనిలో అసలు వేలే పెట్టడని” చెప్పుకొచ్చారు. అయితే కోన వెంకట్ ప్రత్యేకంగా మహేష్ ఒక్కరి పేరే చెప్పారంటే… మరి వేలు పెట్టే ఇతర హీరోల పేర్లు ఏంటి? అన్న ఆసక్తి నెలకొన్నా… దీనికి ఇప్పటికే సినీ వర్గాలకు, ప్రేక్షకులందరికీ సమాధానం తెలుసు గనుక పేరు చెప్పలేదన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories