కొరటాల డిక్లేర్ చేసారు… హోరెత్తుతోంది..!

Koratala Siva requests not to encourage leaks and piracy“స్పైడర్” సినిమాకు లభించిన ఫలితంతో ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులంతా నిరాశలో ఉన్న విషయం తెలిసిందే. ఒక వర్గం వారిని ఆకట్టుకున్నా… ఓవరాల్ గా బాక్సాఫీస్ వద్ద ‘స్పైడర్’ ఫలితం భారీ డిజాస్టర్ అని ఖరారైన నేపధ్యంలో… సాధారణంగానే అభిమానుల ఆశలు కొరటాల శివ దర్శకత్వం వహించబోయే సినిమాపై వెళ్ళాయి. గతంలో ప్రిన్స్ కు ‘శ్రీమంతుడు’ సినిమా ఇవ్వడంతో, ఈ సారి కూడా అలాంటి ‘బ్లాక్ బస్టర్’ సినిమానే వస్తుందని ఎంతో ఆశతో ఉన్నారు. వారి ఆశలకు, అంచనాలకు జీవం పోసే విధంగా ఓ స్టిల్ ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది.

ADVERTISEMENT

అవును… ప్రిన్స్ అభిమానులంతా ఈ స్టిల్ ను చూసి పండగ చేసుకుంటున్నారు. లీకేజ్ ద్వారా బయటకు వచ్చిన ఈ స్టిల్ పట్ల ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా ఉన్నప్పటికీ, చిత్ర యూనిట్ మాత్రం పూర్తి అసంతృప్తితో ఉంది. దీంతో రంగంలోకి దిగిన కొరటాల, ఇలాంటి లీకేజ్ ను ప్రోత్సహించవద్దని, మీడియాకు మరియు అభిమానులకు ఓ సందేశాన్ని ఇచ్చారు. ఈ సినిమా కోసం చిత్ర బృందం పడుతోన్న కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుందని, అందుకే మన సినిమాలోని ఈ స్టిల్ ను సర్క్యూలేట్ చేయవద్దని మీడియాకు విజ్ఞప్తి చేసారు.

కొరటాల చేసిన ట్వీట్ తో ఓ అంశమైతే స్పష్టమైంది. ముఖ్యమంత్రిగా ప్రిన్స్ మహేష్ బాబు లుక్ సింపుల్ గా కనపడుతున్నా, అదిరిపోయేలా ఉన్నాడన్నది అయితే స్పష్టం. ముందు వెనుక సెక్యూరిటీ నడుమ నడుస్తున్న మహేష్ బాబు కన్నులవిందు చేసేలా దర్శనమిస్తుండడంతో అభిమానుల ఆనందం తారాస్థాయిలో ఉంది. దీంతో “త్వరలోనే ప్రతి ప్రశ్నకు, ప్రతి మాటకు సమాధానం లభిస్తుంది” అంటూ చేస్తోన్న ట్వీట్లతో సోషల్ మీడియా హోరెత్తుతోంది. లీకైన ఫస్ట్ పోస్టర్ అయితే అభిమానుల ఆశలను నిలబెట్టేదిలా కనపడుతోంది.

ADVERTISEMENT
Latest Stories