ktr-padayatra-in-telangana

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కనుమరుగు కావడానికి సిద్ధంగా ఉంది అన్న నేపథ్యంలో అప్పటి కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు వైస్ రాజశేఖర్ రెడ్డి తన పార్టీని ప్రజలకు చేరువ చేయడానికి, తనను తానూ నాయకుడిగా నిరూపించుకోవడనికి పాదయాత్రను ఎంచుకున్నారు.

ఆ పాదయాత్ర కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగింది, అలాగే వైస్సార్ ను రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయగలిగింది. ఇక అప్పటి నుంచి తెలుగు రాజకీయాలలో పాదయాత్ర అనేది రాజకీయ నాయకులకు ఒక పదవి పొందే అస్త్రంగా మారిపోయింది. వైస్సార్ పాదయాత్ర ఆనవాయితీని ముందుకు తీసుకెళ్తూ టీడీపీ అధినేత చంద్రబాబు కూడా రాష్ట్ర విభజనకు ముందు పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.

Also Read – ఆ రెండు పార్టీలకి గేమ్ చేంజర్‌ విశాఖపట్నమే!

అలాగే ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారు. రాజశేఖర్ రెడ్డి మొదలు పెట్టిన పాదయాత్ర సంప్రదాయాన్ని జగన్ జైలు యాత్రగా మార్చుకున్నారు. 16 నెలలు జైలు జీవితం గడిపిన జగన్ తనకు ముఖ్యమంత్రిగా ఒక్క అవకాశం ఇవ్వాలంటూ తన తండ్రి పునాది వేసిన పాదయాత్ర అస్త్రాన్ని బయటకు తీశారు. అనుకున్న లక్ష్యాన్ని అందుకున్నారు.

2019 ఎన్నికలకు ముందు టీడీపీ ని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి తన తండ్రిని ముఖ్యమంత్రిని చేయడానికి ‘యువగళం’ పాదయాత్ర ను మొదలుపెట్టారు. దానికి తోడు వైసీపీ ప్రభుత్వం బాబు మీద ఆధారాలు లేని ఆరోపణలతో కేసులు మోపి దాదాపు 60 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్ లో నిర్బంధించారు.

Also Read – ఒకేసారి ముగ్గురి హీరోలకు బ్రేక్ ఇచ్చేలా ఉంది!

బాబు జైలుకెళ్లిన సింపతీ, లోకేష్ పాదయాత్ర చేసిన సంప్రదాయం రెండు కలగలిపి 164 సీట్లతో టీడీపీ కూటమి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను పరిశీలిస్తే బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అరెస్టు చేసి జైలు కి పంపించారు కేసీఆర్.

అయితే తనకు బిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవమానాలకు కాను తానూ ఎప్పటికైనా బదులు తీర్చుకుని తీరుతా అంటూ పంతం పట్టారు రేవంత్ రెడ్డి. జైలుకెళ్లిన జగన్, రేవంత్ ఇద్దరు కూడా వారి వారి రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార చేసారు. అలాగే గత ఏడాది రాజమండ్రి సెంట్రల్ జైలుకెళ్లోచ్చిన బాబు కూడా 2024 లో సీఎం గా బాధ్యతలు చేపట్టారు.

Also Read – జగన్‌ మార్క్ రాజకీయాలు ఇలాగే ఉంటాయి మరి!

ఈ నేపథ్యంలో ఇప్పుడు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద ఈ ఫార్ములా లో అక్రమాలు అంటూ ఎసిబి A1 గా కేసు నమోదు చేసింది. అయితే బిఆర్ఎస్ ఓటమి తరువాత అటు పార్టీ నేతలలో, కార్యకర్తలలో నైరాశ్యం నిండుకున్న సందర్భంలో కేటీఆర్ తానూ కూడా అవసరమైతే తెలంగాణ అంతటా పాదయాత్ర చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు.




ఇక ఇప్పుడు ఈ ఫార్ములా కేసులో ఎసిబి అధికారులు దూకుడుగా ముందుకు వెళ్లగలిగితే మాజీ మంత్రి కూడా జైలు యాత్ర చేయక తప్పని పరిస్థితి. అయితే తమ నేత కూడా జగన్, రేవంత్, బాబు మాదిరి జైలుకెళితే ఇక రాబోయే ఎన్నికలలో బిఆర్ఎస్ అధికారాన్ని చేపట్టడం, కేటీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవడం ఖాయం అంటున్నారు కేటీఆర్ పొలిటికల్ ఫాలోవర్స్.