తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ఒక కాంగ్రెస్ బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటు చేస్తునట్టు ప్రకటించారు. రాష్ట్రాల అవసరాలు ఢిల్లీలో కూర్చున్న మీకేంతెలుస్తాయి? కేంద్రం విదేశీ సంబంధాలకు, సరిహద్దుల రక్షణకు, జాతీయ రహదారుల నిర్వహణకు మాత్రమే కట్టుబడి ఉండాలని ఆయన కొత్త రాగం అందుకున్నారు.
తెలంగాణ బడ్జెట్ సమావేశాల తరువాత కేసీఆర్ దేశమంతా ప్రకటించి వివిధ పార్టీల మద్దత్తు కూడగట్టే ప్రయత్నం చేస్తారు. అప్పటినుండి ఆయన ఎక్కువగా జాతీయ రాజకీయాల మీద ఫోకస్ పెట్టాల్సిరావొచ్చు. దీనితో వచ్చే తెరాస ప్లీనరీ సమావేశాల్లో కేటీఆర్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటించే అవకాశం ఉన్నటు సమాచారం.
పార్టీలో దీనికి ఎటువంటి ఇబ్బంది రాకుండా నిన్న హరీష్ రావుతో వ్యూహాత్మకంగా ఒక స్టేట్మెంట్ ఇప్పించారు. హరీష్ తిరుగుబాటు వార్తలపై ఆయనతోనే ఖండన ఇప్పించారు. తన పుట్టుక.. చావు కూడా తెరాసలోనేనని హరీష్ రావు స్పష్టంచేశారు. ఉద్యమంలో త్యాగాలు చేసిన కుటుంబం నుంచి తాను వచ్చానన్నారు.
తెరాసలో తాను క్రమశిక్షణ కల్గిన కార్యకర్తనని, ముఖ్యమంత్రి కేసీఆర్ మాటే తన బాట అని హరీష్ స్పష్టంచేశారు. దీనిబట్టి హరీష్ కేటీఆర్ కు లైన్ క్లియర్ చేసినట్టే అనుకోవాలి. కేటీఆర్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తే వచ్చే ఎన్నికల ఫలితాల తరువాత ఆయనను ముఖ్యమంత్రి చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు.



