తెరాసలో అభ్యర్థి మారబోయే మొదటి సీట్ అదేనా?

KTR mediating between- kadiyam srihari and t rajaiahఅసెంబ్లీని రద్దు చేసిన కొన్ని గంటలలోనే సీఎం కే చంద్రశేఖరరావు పార్టీకి చెందిన 105 సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. అయితే అప్పటినుండే కొన్ని సీట్లలో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఆ మాట నిజమేమో అన్నట్టు స్టేషన్‌ ఘన్‌పూర్‌ పంచాయతీ నడుస్తుంది.

[m9ad]

ADVERTISEMENT

నియోజకవర్గ తెరాస అభ్యర్థిగా టి. రాజయ్యను ప్రకటించడంతో కొన్ని రోజులుగా అసమ్మతి జోరందుకుంది. కడియం శ్రీహరికే టిక్కెట్‌ కేటాయించాలని స్థానిక నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు కేటీఆర్‌ రంగంలోకి దిగారు. ప్రగతిభవన్‌లో కడియం, రాజయ్యతో భేటీ అయ్యారు.

అసంతృప్తి రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఏం చేయాలి? ఎలా సర్దుబాటు చేయాలనే అంశంపై సమాలోచనలు జరుపుతున్నారు. ఇటీవలే రాజయ్య కు సంబంధించిన కొన్ని అసభ్యకరమైన సంభాషణలు గల కొన్ని టేపులు బయటకు వచ్చాయి. దీనితో తెరాసలో అభ్యర్థి మారబోయే మొదటి సీట్ అదేనా? అనే ఊహాగానాలు వస్తున్నాయి.

ADVERTISEMENT
Latest Stories