అప్పుడు మోడీకి మేలు చేసినట్టే… ఇప్పుడు కేటీఆర్ కు..!!

KTR responds to Uttam Kumar controversial commentsముందస్తు ఎన్నికలతో తెలంగాణలో రాజకీయం వేడేక్కింది. నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, కౌంటర్స్‌ ఇవ్వడం మొదలైంది. టీపీసీసీ ఛీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అంట్లు తోముకునేవాడు అంటూ తనపై చేసిన వ్యాఖ్యలపై ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ నిన్న ట్విటర్‌ వేదికగా తనదైన శైలిలో స్పందించారు.

ADVERTISEMENT

[m9ad]

“నేను అమెరికాలో ఉన్నప్పుడు నా పనులు సొంతంగా చేసుకున్నాను. మీ పప్పులా కాకుండా సొంతంగా సంపాదించుకున్నాను. అందుకు నేను గర్వపడుతున్నాను. నీలాగా ప్రజల సొమ్ముదోచుకుని కారులో తగలబెట్టలేదు,” అని ఉత్తమ్‌కు కేటీఆర్‌ చురకలింటించారు. గతంలో కాంగ్రెస్ మోడీని ఛాయ్ వాలా అంటూ అవమానించారు దానిని ఆయన వాడుకుని ప్రజలలో సింపతీ తెచ్చుకున్నారు.

ఇప్పుడు కేటీఆర్‌ మీద కూడా అటువంటి విమర్శలే చెయ్యడంతో ఆయనకు ఒక రకంగా కాంగ్రెస్ మేలు చేసినట్టు అయ్యింది. ఇటువంటి వ్యాఖ్యలు ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో తెరాసకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఎప్పటిలానే కాంగ్రెస్ అయోమయంలో ఉన్నట్టుగానే కనిపిస్తుంది.

ADVERTISEMENT
Latest Stories