రాజకీయ సన్యాసం – సిఎం తనయుడు ఛాలెంజ్!

KTR-Solid-Retort-to-Congressman-on-Twitterఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలలో విమర్శలు ఎంత సహజమో, ఛాలెంజ్ లు కూడా అంతే సహజం. అందులో భాగంగానే తెలంగాణా ముఖ్యమంత్రి తనయుడు, రాష్ట్ర మంత్రి అయిన కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. “వచ్చే ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాని పక్షంలో తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని” గతంలో తాను చేసిన ప్రకటనకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని అన్నారు.

ఇదే సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సవాల్ విసిరారని, ఆయన మాట మీద నిలబడతారో లేదో గానీ తాను మాత్రం, మాట మీద నిలబడతానని చెప్పుకొచ్చారు. తెలంగాణాలో ఈ దుస్థితికి కారణం కాంగ్రెస్ పార్టీయేనని, రాష్ట్ర ప్రజలే తెలంగాణాను సాధించుకున్నారని, ఏ అమ్మ, బొమ్మ ఇవ్వలేదని సోనియా గాంధీని ఉద్దేశిస్తూ చమత్కరించారు.

ADVERTISEMENT

వచ్చే ఎన్నికలలో టీఆర్ఎస్ అధికారంలోకి రావడం తధ్యం అన్న విషయం బహిరంగమే. తెలంగాణాలో ప్రతిపక్షమే లేకుండా చేయడంలో టీఆర్ఎస్ సక్సెస్ కావడంతో, ప్రస్తుతం ‘ఏక్ నిరంజన్’గా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. తెలుగుదేశం పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేసిన టీఆర్ఎస్, ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ను కూడా అదే బాటలో పయనింప చేస్తోంది.

ADVERTISEMENT
Latest Stories