kushboo after watching jai lava kusa‘యంగ్ టైగర్’ జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే తన అభిమాన నటుడని నిర్మొహమాటంగా ప్రకటించే తమిళ బ్యూటీ ఖుష్భూ, తాజాగా “జై లవకుశ” సినిమాను వీక్షించింది. ఫైనల్ గా రెండవ రోజు తనకు టికెట్లు దొరికాయని చెప్తూ ట్వీట్ చేసిన ఖుష్భూ, సినిమా చూసిన తర్వాత తన అనుభవాలను పంచుకుంది. ఒక విధంగా చెప్పాలంటే… జూనియర్ ఎన్టీఆర్ పై తనకున్న అభిమానాన్ని మరోసారి బాహ్య ప్రపంచానికి చాటి చెప్పిందని చెప్పవచ్చు.

“జై = తారక్, లవ = తారక్, కుశ = తారక్… నేను ఆయన్ని ఒక్కడే కనిపించారు, క్షమించాలి ఇతరులు నా కంటికి కనిపించలేదు, నేను తారక్ ను మాత్రమే చూడగలిగాను…” అంటూ చేసిన ట్వీట్ ‘యంగ్ టైగర్’ ఫ్యాన్స్ లో ఉత్సాహం లేపింది. అవును… మూడు విభిన్న పాత్రలలో కనిపించిన తారక్ ను చూసి ఇదే విధంగా సగటు అభిమాని ఫీల్ అవుతున్నారు. అయితే సెలబ్రిటీలు కూడా ఇందుకు అతీతం కాదని ఖుష్భూ వంటి వారు నిరూపిస్తున్నారు.