భువనేశ్వరి టార్గెట్ గా లక్ష్మీ పార్వతి….

Lakshmi Parvathi Counters Nara Bhuvaneswari Remarks

ఎన్టీఆర్ భార్యగా గుర్తింపు కోసం పోరాడుతున్న వైసీపీ నేత లక్ష్మి పార్వతి, ఎన్టీఆర్ కుమార్తె నారా భువనేశ్వరి తాజా ప్రసంగం పై కౌంటర్ ఇచ్చేందుకు మీడియా ముందుకొచ్చారు. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ లో తన పై జరిగిన వ్యక్తత్వ హననం పై స్పందించారు భువనేశ్వరి.

నాటి కౌరవ సభ మాదిరే వైసీపీ కూడా చట్ట సభలో తనను అవమానించిందంటూ నారా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలకు లక్ష్మి పార్వతి ఆధారాలు చూపాలంటూ, భువనేశ్వరి పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారంటూ ఆమె పై ఎదురుదాడి చేసారు.

ADVERTISEMENT

భర్త చంద్రబాబు, కొడుకు లోకేష్ మాదిరి భువనేశ్వరి కూడా అబద్దాల కుటుంబంలో చేరిపోయారంటూ ఎన్టీఆర్ కుటుంబ సభ్యురాలిగా చెప్పుకునే లక్ష్మి పార్వతి ఎన్టీఆర్ కుమార్తె మీద, ఆమె ఆత్మగౌరవం మీద విమర్శలు సాగించారు. వైసీపీ రాజకీయ ప్రణాళికలో భాగంగానే ఇలా భువనేశ్వరి టార్గెట్ గా లక్ష్మి పార్వతిని తెరమీదకు తెచ్చారా.? అన్నది ఇక్కడ చర్చనీయాంశంగా మారింది.

లక్ష్మి పార్వతి ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల టార్గెట్ గా, టీడీపీ కేంద్రంగా ఎంతలా రెచ్చిపోతున్నా వైసీపీ మాదిరి టీడీపీ లక్ష్మి పార్వతి టార్గెట్ గా విమర్శలకు సమయం వెచ్చించడం లేదు. షర్మిల, జగన్ సొంత సోదరి అయినప్పటికీ వైసీపీ పార్టీని కాదనుకున్న ఒకేఒక్క కారణంతో షర్మిలకు కూడా రాజకీయ మినహాయింపు లేదుగా అనేలా అనే ఆమె పుట్టుక నుంచి అత్తంటి పేరు వరకు సాక్షిలో డిబేట్లు, వైసీపీ సోషల్ మీడియాలో ఆమెకు వ్యతిరేకంగా వికృత పోస్టు లు పుట్టుకొచ్చాయి.

కానీ కొన్ని దశాబ్దాలుగా లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ పేరు కవచంలా అడ్డుపెట్టుకుని మరి అదే ఎన్టీఆర్ కుటుంబాన్ని ముఖ్యంగా బాబు దగ్గర మొదలుపెట్టి ఆయన తనయుడు లోకేష్ వరకు ఇక ఇప్పుడు స్వయానా ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరి వరకు వెళ్లినా టీడీపీ ఆమె పై హద్దులు దాటి విమర్శలు చెయ్యలేదు.

అయితే అది టీడీపీ బలహీనత అనేది వైసీపీ నేతల అభిప్రాయం కాగా అయితే అదే టీడీపీ రాజకీయ విలువలు, మహిళల గౌరవం పట్ల పార్టీకున్న చిత్తశుద్ధి అనేది టీడీపీ వాదన.ఏదిఏమైనా లక్ష్మీ పార్వతి వైసీపీ చేతిలో ఒక రాజకీయ కీలుబొమ్మగా మారింది అనేది స్ఫష్టంగా కనిపిస్తుంది అంటున్నారు నారా, నందమూరి అభిమానులు.

ADVERTISEMENT
Latest Stories