శ్రీవారి ఆభరణాల ప్రదర్శన లేనట్టే

Lord Venkateshwara ornamanetsశ్రీవారికి భక్తులు సమర్పించిన అపురూపమైన పలు ఆభరణాలు మాయమయ్యాయని మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు చేసిన ఆరోపణలు తీవ్ర సంచలనం సృష్టించడం తెలిసిందే. పవన్ కళ్యాణ్ వంటి వారు కూడా తీవ్ర విమర్శలు చెయ్యడంతో ప్రభుత్వం ఒక దశలో శ్రీవారి ఆభరణాలు అన్నీ ప్రదర్శించాలని అనుకుంది.

ADVERTISEMENT

అయితే ఆగమశాస్త్ర పండితులు దీనికి ససేమీరా అంటున్నారు. శ్రీవారి బంగారు వాకిలి దాటి బంగారు ఆభరణాలు బయటకు తీసుకువడానికి శాస్త్రాలు ఒప్పుకోవని, శ్రీవారి ఆభరణాలు చివరికి మెరుగు పెట్టాలన్నా ఆలయంలోనే పెట్టాలని, కాబట్టి ప్రదర్శన అనేది కుదరదని వారు తేల్చి చెప్పారు.

దీనితో ఈ వివాదం వంకనైనా శ్రీవారి అన్ని ఆభరణాలు చూసే భాగ్యం కలుగుతుందని భావించిన భక్తులు నిరాశకు గురయ్యారు. శ్రీవారి తిరువాభరణ రిజిస్టర్‌లో 1200కిపైగా ఆభరణాలున్నాయి. అయితే రమణదీక్షితులు చేస్తున్న ఆరోపణలను మిగతా అర్చకులు సైతం ఖండిస్తున్నారు. అసలు ఆభరణాలు మాయమయ్యే అవకాశమే లేదని వారు తేల్చి చెబుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories