ప్రజా గాయకుడు గద్దర్ ను ముఖ్యమంత్రి అభ్యర్ధి అని టి.మాస్ అధ్యక్షుడు కంచ ఐలయ్య ప్రకటించడమే కాకుండా, గద్దర్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ పై పోటీచేయిస్తామని కూడా చెప్పారు. అయితే ఇప్పుడు ఆయనను కాంగ్రెస్ లోని తీసుకురావాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుందట. గద్దర్ తో కాంగ్రెస్ పార్టీ ప్రచార విభాగం చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క భేటీ అయ్యారు.
[m9ad]
కాగా భట్టి ఈ భేటీపై మాట్లాడుతూ ప్రముఖ గాయకుడు గద్దర్, గోరేటి వెంకన్న, విమలక్కలను తమతో కలిసి రావాలని ఆహ్వానిస్తున్నామని అన్నారు. టీఆర్‌ఎస్ నాలుగున్నరేళ్ల పాలనలో తెలంగాణ దోపిడీకి గురయ్యిందని, ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాలంటే అందరు ఒక తాటి మీదకు వచ్చి కేసీఆర్ ను గద్దె దించేవరకు కలిసి పని చెయ్యాలని అన్నారు.
గద్దర్, కోదండరామ్, గోరేటి వెంకన్న, విమలక్క వంటి వారు తెలంగాణ ఉద్యమ సమయంలో గట్టిగా పని చేశారనే అభిప్రాయం ప్రజలలో ఉంది. వీరు మహాకూటమికి మద్దతు ఇస్తే ప్రజలలో మహాకూటమిపై విశ్వసనీయత పెరుగుతుందని కాంగ్రెస్ వారి వ్యూహంగా కనిపిస్తుంది. దానికి ఉన్న ఏ ఒక్క అవకాశన్ని వారు వదులుకోవడం లేదు.



