‘అతడు’ కాంభినేషన్ రిపీట్… ఫ్యాన్స్ కు పండగే..!

Mahesh Babu - Ar Murugadoss Movie Newsగత రెండు దశాబ్ద కాలంలో “అతడు” సినిమా అనేది ఎవర్ గ్రీన్ క్లాసిక్. ఈ సినిమా చాలామందికి జీవితాన్ని ఇచ్చిందని చెప్పాలి. హీరోగా మహేష్ బాబు మొదలుకుని, దర్శకుడు, సాంకేతిక నిపుణులు, తెరవెనుక ఉండే ప్లే బ్యాక్ సింగర్లు, రచయితలు… ఇలా ఒకటేమిటి అనేక మంది జీవితాల్లో సంతోషాన్ని నింపింది. ఆ జాబితాలోనే రచయిత విశ్వ పేరు పలకగానే ‘పెను తుఫాన్ తలొంచి చూసే…’ అనే ఇంట్రడక్షన్ సాంగ్ గుర్తుకు వస్తుంది. టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన ఈ పాటతో విశ్వ పేరు మారుమ్రోగిపోయింది.

టాలీవుడ్ హీరోలలో బెస్ట్ ఇంట్రడక్షన్ సాంగ్ గా నిలిచిపోయిన ఆ కాంభినేషన్ మళ్ళీ రిపీట్ అవుతోంది. మురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న సినిమాకు, ఇంట్రడక్షన్ సాంగ్ విశ్వనే అందించారు. ఇటీవలే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాకు డబ్బింగ్ అందించిన విశ్వ, ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘కాటమరాయుడు’ సినిమాలో కూడా పనిచేస్తోన్న విశ్వ, ఈ సినిమాతో తన 150వ సినిమాను పూర్తి చేసుకోబోతున్నాడు.

ADVERTISEMENT

ఇక, ప్రిన్స్ కాంభినేషన్ లో ‘అతడు’ సినిమా ఆల్ టైం హిట్ జాబితాలో నిలువగా, ఆ తర్వాత వీరిద్దరి ‘దూకుడు’కు అడ్డులేకుండా పోయిన విషయం తెలిసిందే. ‘నీ దూకుడు… సాటేవ్వరూ…’ అంటూ పలికించిన విశ్వ, ఈ సారి ఏ స్థాయిలో రెచ్చిపోతారో చూడాలి. మహేష్ సినిమాలకు ప్రత్యేకించి గీతాలను అందించే విశ్వకు, ఈ సారి తెలుగు, తమిళ భాషలకు సరిపోయే లిరిక్స్ ను అందించాల్సిన బాధ్యత ఉంది. సెంటిమెంట్ పరంగా వీరిద్దరిది సూపర్ హిట్ జోడి కావడం అభిమానులకు ఉత్సాహాన్నిచ్చే అంశం.

ADVERTISEMENT
Latest Stories