2018… మహేష్ ఫ్యాన్స్ కు స్వీట్ న్యూస్..!

Mahesh Babu Getting Ill-Advisedప్రిన్స్ మహేశ్ బాబు అభిమానులంతా ఆయన తాజా చిత్రమైన ‘భరత్ అనే నేను’ కోసం ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో కైరా అద్వాని కథానాయికగా నటిస్తుండగా, ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

దీని తరువాత మహేశ్ బాబు తన 25వ సినిమాను వంశీ పైడిపల్లితో చేయనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. కథ ప్రకారం ఈ సినిమా షూటింగ్ న్యూ యార్క్ లో ఎక్కువగా జరగనుంది. అందువలన అక్కడి లొకేషన్స్ ను ఎంపిక చేశారు. ఫిబ్రవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్నట్టు తెలుస్తోంది.

ADVERTISEMENT

అశ్వనీదత్ – దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాను వచ్చే ఏడాది దీపావళికి విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. మొత్తానికి వచ్చే ఏడాది మహేశ్ బాబు నుంచి రెండు సినిమాలు రానున్నాయన్న మాట. ప్రిన్స్ అభిమానులకు ఇంతకు మించిన స్వీట్ న్యూస్ మరొకటి ఉండదని చెప్పడంలో సందేహం లేదు.

ADVERTISEMENT
Latest Stories