విజయవాడలో విఐపిల స్పెషల్ ‘బ్రహ్మోత్సవం’

Mahesh Babu Brahmotsavam movieమరికొద్ది గంటల్లో వెండితెరపై దర్శనమివ్వబోతున్న ప్రిన్స్ మహేష్ బాబు “బ్రహ్మోత్సవం” సినిమాను విజయవాడలో ఒక సామజిక కారణానికి ఉపయోగిస్తుండడం విశేషం. సినిమాలంటే వినోదమే అయినప్పటికీ, కుటుంబ విలువలు, సంప్రదాయాలతో కూడుకున్న ‘బ్రహ్మోత్సవం’ సినిమా మాత్రం అంతటా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

2015లో ఒలింపిక్ రన్ ను నిర్వహించినటువంటి ‘వైట్ వింగ్స్’ సంస్థ ప్రతినిధులు దాదాపుగా 350 మంది వీవిఐపి, విఐపిలకు “బ్రహ్మోత్సవం” సినిమా టికెట్లను పంపిణీ చేసారు. ‘పచ్చదనం’పై చైతన్యం కలిగించే విధంగా ఈ స్పెషల్ షోకు విచ్చేసిన విఐపిలకు వారింటి పరిసరాల్లో పెంచుకునే విధంగా మొక్కలను పంపిణీ చేయనున్నారు.

ADVERTISEMENT

సినిమా విడుదలయ్యే రోజు శుక్రవారం రాత్రి ట్రెండ్ సెట్ మాల్ లో గల ‘క్యాపిటల్ సినిమాస్’లో 10.30 నిముషాల షోను ఏర్పాటు చేసారు. నగర పోలీస్ కమీషనర్ గౌతమ్ సవాంగ్, మునిసిపల్ కమీషనర్ వీరపాండ్యన్, విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యేలు బొండా ఉమా మహేశ్వరరావు, గద్దె రామ్మోహన్ రావు, జలీల్ ఖాన్ వంటి ప్రముఖులు ఈ షోకు హాజరు కాబోతున్నారు.

ADVERTISEMENT
Latest Stories