టాక్ వస్తే చాలు… మహేష్ వదలడం లేదుగా..!

Mahesh Babu  Congrats PSV Garuda Vega Teamమంచి చిత్రాలను ప్రశంసించడంలో ముందుండే ప్రిన్స్ మహేష్ బాబు మరోసారి అలాంటి కార్యక్రమమే చేసారు. ఇటీవల విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న “పీఎస్వీ గరుడవేగ” సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ తాజాగా ట్వీట్ చేసారు. కమర్షియల్ గా ఈ సినిమా ఎంత సక్సెస్ అన్న దానిని పక్కన పెడితే, ఈ సినిమాతో దర్శకుడిగా ప్రవీణ్ సత్తార్ కు, నటుడిగా రాజశేఖర్ కు మంచి గుర్తింపు లభించింది.

ఈ సినిమాను చూసి మహేష్ బాబు, నమ్రత ప్రత్యేకంగా తమకు ఇంటికి ఆహ్వానించారని ఇటీవల జీవిత బహిరంగంగానే వెల్లడించగా, తాజాగా ప్రిన్స్ తన ట్వీట్ తో మరోసారి “పీఎస్వీ గరుడవేగ”ను లైంలైట్ లో ఉంచారు. మంచి టాక్ వస్తున్న ప్రతి సినిమాను అభినందిస్తూ ట్వీట్ చేయడం ఇటీవల కాలంలో ప్రిన్స్ కు పరిపాటిగా మారిన వైనం చెప్పుకోదగ్గ విషయం.

ADVERTISEMENT

గతంలో కూడా ఇలా కొన్ని సినిమాలకు అభినందనలు తెలిపినప్పటికీ, ఇటీవల కాలంలో ఆ ఉధృతి మరింత పెరగడం గమనించదగ్గ విషయం. ఈ ఏడాది సెన్సేషన్ గా నిలిచిన “అర్జున్ రెడ్డి” సినిమా సందర్భంలోనూ ప్రిన్స్ వ్యక్తపరిచిన భావాలు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిన వైనం తెలిసిందే. చూడబోతుంటే కొత్త దర్శకులతో పని చేయాలన్న ఆకాంక్ష ప్రిన్స్ ట్వీట్స్ లో కనపడుతోందన్న మాట!

ADVERTISEMENT
Latest Stories