మహేష్ క్యారెక్టర్ బయటపెట్టిన మ్యూజిక్ డైరెక్టర్!

mahesh-babu-cop-role-murugadoss-harris-jayarajమురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా రూపుదిద్దుకుంటున్న సినిమాలో హీరో పాత్ర ఏమిటి? అన్న ఆసక్తి అభిమాన వర్గాలతో పాటు సినీ ఇండస్ట్రీలోనూ వ్యక్తమవుతోంది. ఈ సినిమాలో తొలిసారిగా మహేష్ ఒక న్యాయవాది పాత్రలో కనపడనున్నారనే టాక్ తో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా ఈ సినిమా సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ ఈ సినిమాలో ప్రిన్స్ పోషించబోయే పాత్రను రివీల్ చేసారు.

ఇప్పటివరకు హల్చల్ చేసిన పుకార్లకు తెరదించుతూ ఒక ‘కాప్’ రోల్ లో ప్రిన్స్ కనిపించబోతున్నారని, ఈ సినిమా ‘ఒక స్టైలిష్ కాప్ థ్రిల్లర్’ అంటూ స్పష్టం చేసాడు. దీంతో ఊహాగానాలకు తెరపడినట్లయ్యింది. ఇప్పటివరకు ప్రిన్స్ పోలీస్ గా తెరకెక్కిన మూడు సినిమాలో “పోకిరి, దూకుడు” రెండు బ్లాక్ బాస్టర్స్ గా నిలవగా, “ఆగడు” అడ్రస్ లేదు. దీంతో నాలుగవ సారి ప్రిన్స్ పోలీస్ పాత్రను ధరిస్తుండడం ప్రిన్స్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ADVERTISEMENT

దీనికి తోడు మురుగదాస్ ఇలాంటి పోలీస్ చిత్రాలను అద్భుతంగా తెరకెక్కిస్తారని “తుపాకీ”తో రుజువైంది. సాధారణంగానే మురుగదాస్ + మహేష్ కాంభినేషన్ ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. హారిస్ జయరాజ్ ఇచ్చిన తాజా సమాచారంతో మార్కెట్ లో ఈ సినిమా మరింతగా మారుమ్రోగడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories