మహేష్ తో సినిమా… టైం రావాలి…!

Little Girl's Surprise to Mahesh Babuప్రిన్స్ మహేష్ బాబు సోదరి మంజుల మొదటిసారిగా మెగా ఫోన్ చేతబట్టి, ‘మనసుకు నచ్చింది’ సినిమా చేశారు. సందీప్ కిషన్, అమైరా దస్తూర్ నాయకానాయికలుగా నటించిన ఈ సినిమాను ఈ నెల 16వ తేదీన విడుదల చేస్తున్నారు. ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా మంజుల మాట్లాడుతూ… ” జీవితంలో చిన్న చిన్న అనుభూతుల్ని ఎలా కోల్పోతున్నాం… వాటిని ఎలా ఆస్వాదించాలి? అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా కధ కొనసాగుతుందని” తెలిపారు.

ప్రకృతి కూడా ఈ సినిమాలో ఒక ప్రధానమైన పాత్రలా కనిపిస్తుంది. లవ్… కామెడీ… ఎమోషన్స్ ఈ సినిమాకి హైలైట్స్ గా నిలుస్తాయి. డైరెక్షన్ అంత ఈజీ కాదంటూనే మహేష్ నన్ను ఎంకరేజ్ చేశాడు. మహేష్ తో ఒక సినిమా చేయాలనే కల అందరి దర్శకులకు ఉంటుంది. అలాగే ఆయనతో ఒక సినిమా చేయాలని నాకూ వుంది, అందుకు టైమ్ రావాలి. ఇక మహేషే పిలిచి సినిమా చేద్దాం అంటే, అంతకి మించిన అదృష్టం లేదు… అంటూ చెప్పుకొచ్చారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories