మెగా ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన మహేష్ బాబు!

Mahesh Babu, Mahesh Babu Chiru Birthday Celebrations, Prince Mahesh Babu Chiru Birthday Celebrations, Super Star Mahesh Babu Chiru Birthday Celebrations, Mahesh Babu Chiru 61 Birthday Celebrations, Mahesh Babu Chiru Birthday Celebrations 2016, Mahesh Babu Chiranjeevi 61 Birthday Celebrations, Mahesh Babu Megastar 61 Birthday Celebrationsతన సినిమా ఆడియో వేడుకలకు తప్ప ఇతర సినీ వేదికలపై ప్రిన్స్ మహేష్ బాబు తారసపడడం బహు అరుదుగా జరిగే విషయం. ఏడాదిలో ఓ రెండు, మూడు సార్లైనా అలా కనపడని ప్రిన్స్, తాజాగా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు పార్టీకి హాజరు కావడం విశేషం. హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన గ్రాండ్ పార్టీకి తన సతీమణితో సహా విచ్చేసి ప్రిన్స్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.

చిరు పుట్టినరోజు అంటే అది మెగా ఫ్యామిలీ మరియు సన్నిహితుల వరకే పరిమితమయ్యే అంశం. మరి అలాంటి వేడుకకు నమ్రతతో సహా మహేష్ హాజరు కావడం టాలీవుడ్ లో పెద్ద చర్చకే దారి తీసింది. అందులోనూ చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ కూడా హాజరు కాని పార్టీకి ప్రిన్స్ ప్రాధాన్యమిచ్చి వెళ్ళారంటే… దానికి ఏదో బలమైన కారణం ఉండి ఉండాలి… లేదంటే… ఈగో అన్న పదానికి మహేష్ బహుదూరం అని మరోసారి రుజువు చేసినట్లవుతుందని సినీ జనాలు చెప్పుకుంటున్నారు.

ADVERTISEMENT

ఒక విధంగా ఈ మెగా పార్టీకి మహేష్ హాజరు మెగా ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చినట్లే… అలాగే ప్రిన్స్ అభిమానులు కూడా ఊహించని పరిణామం. అయితే సినీ పరిశ్రమలో ఎవరితో ఎలాంటి విభేదాలు లేకుండా కొనసాగే ప్రిన్స్ వైఖరి టాలీవుడ్ వర్గాలకు తెలిసిన విషయమేనని, ఆ క్రమంలోనే మెగాస్టార్ కు స్వయంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేందుకు హాజరై ఉండవచ్చని తెలుస్తోంది. మహేష్ కాకుండా ‘మెగా’ కోటరీ హీరోలు రవితేజ, శ్రీకాంత్ లు విచ్చేయగా, అక్కినేని యువకెరటం అఖిల్ కూడా ఈ పార్టీలో భాగస్వామ్యులయ్యారు.

ADVERTISEMENT
Latest Stories