వంశీ పైడిపల్లి తర్వాత సందీప్ రెడ్డి వంగా?

Mahesh babu-Arjun-Reddy-Director-Sandeep-Reddy-Vangaసందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. యూత్ ను ఒక రేంజ్ లో ఈ సినిమా ఆకట్టుకుంది. దాంతో ఆయనతో కలిసి పనిచేయడానికి ఎంతోమంది యువ కథానాయకులు ఉత్సాహాన్ని చూపుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాను అర్జున్ కపూర్ తో హిందీలో రీమేక్ చేయడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నాడు. వచ్చే నెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

ఈ నేపథ్యంలో మహేశ్ బాబును కలిసిన సందీప్ రెడ్డి .. ఒక లైన్ చెప్పాడట. ఆ లైన్ ను డెవలప్ చేసి తీసుకుని రమ్మని మహేశ్ బాబు చెప్పినట్టుగా సమాచారం. వంశీ పైడిపల్లితో తన సినిమా పూర్తయ్యే లోగా పూర్తి కథను సిద్ధం చేసుకుని రమ్మని మహేశ్ అన్నాడట. ఈ లోగా హిందీ సినిమాను కూడా పూర్తి చేసుకుని రావొచ్చనే ఆలోచనలో సందీప్ రెడ్డి వున్నట్టుగా చెప్పుకుంటున్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories