అదే నా ఫైనల్ మూవీ – మహేష్ బాబు!

Mahesh babu no more voice overతాను దర్శకత్వం వహించిన ‘మనసుకు నచ్చింది’ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఘట్టమనేని మంజుల, హైదరాబాద్ లో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమాకు వాయిస్ ఓవర్ కావాలని అడిగిన వెంటనే మహేష్ ఒప్పుకున్నాడని, ఆ తరువాత కొన్ని మార్పులు చెబితే మాత్రం, ‘వేరే వాళ్లతో చెప్పించుకో’ అని తప్పించుకున్నాడని చెప్పింది.

ADVERTISEMENT

ఒకసారి గౌతమ్, “ఆంటీ డైరెక్షన్ లో ఎప్పుడు నటిస్తావు నాన్నా?” అని అడిగితే, “అదే నా అఖరు సినిమా అవుతుంది” అని మహేష్ సరదాగా చెబుతూ తనను ఆట పట్టించాడని మంజుల వెల్లడించింది. ఇక ఇదే కార్యక్రమానికి అతిథిగా వచ్చిన మహేష్ మాట్లాడుతూ, మంజుల ఏదో కాగితాలపై రాసుకుంటుంటే ఏదో కవిత్వమని అనుకున్నానని, తర్వాత సినిమాకు స్క్రిప్ట్ అని తెలిసి ఆశ్చర్యపోయానని చెప్పాడు.

ADVERTISEMENT
Latest Stories