మహేష్ కెరీర్ లో మురుగతో శుభంకార్డ్?

A R Murugadoss - Mahesh Babu!హిట్టయినా, ఫ్లాప్ అయినా తన కెరీర్ లో ఎక్కువగా తెలుగు దర్శకులతోనే మహేష్ బాబు పనిచేసారు. ఇప్పటివరకు చేసిన 23 సినిమాలలో కేవలం రెండంటే రెండు సినిమాలకు మాత్రమే తమిళ దర్శకులకు అవకాశం ఇచ్చారు. అందులో ఒకటి కెరీర్ తొలినాళ్ళల్లో ఎస్.జే.సూర్యకు “నాని” అవకాశం ఇవ్వగా, మళ్ళీ మురుగదాస్ తో “స్పైడర్” సినిమాకు ఒప్పుకున్నారు. ‘నాని’ సినిమా సొంత బ్యానర్ లో తెరకెక్కించగా, ఈ సినిమా నష్టాలను పూడ్చుకోవడానికి పూరీతో ‘పోకిరి’ నిర్మించి ఘనవిజయం అందుకున్నారు.

ADVERTISEMENT

కానీ ‘స్పైడర్’ సినిమాను బయట నిర్మాతలతో తీసినప్పటికీ, సినిమాకు మిగిల్చిన నష్టాల రీత్యా తన పారితోషికాన్ని కూడా ఎంతో కొంత వదులుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆర్ధికపరమైన అంశాలు పక్కన పెడితే నాడు సూర్యతో చేసిన “నాని” సినిమా కమర్షియల్ ఫ్లాప్ అయినప్పటికీ, చిన్నపిల్లోడుగా మహేష్ నటనకు సినీ విమర్శకులు జోహార్లు పలికారు. ఒక స్టార్ హీరో అయ్యుండి అలాంటి కధలను ఎంపిక చేసుకునే గట్స్ ఉన్న హీరోగా, తెలుగులో ప్రయోగాలు చేసే హీరోగా ప్రేక్షకుల చేత నీరాజనాలు అందుకున్నారు.

కానీ ‘స్పైడర్’ విషయంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలే వినిపిస్తున్నాయి. స్టార్ హీరో స్టేటస్ ను మించి అనుభవిస్తున్న ప్రిన్స్, కధలో హీరోయిజం కంటే విలనిజం ఎక్కువ పండుతుందని తెలిసి కూడా ఇలాంటి కధను ఎంపిక చేసుకోవడం మహేష్ కే చెల్లుబాటు అయ్యిందన్న టాక్ ఉంది. అయితే కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్లుగా మారిన తీరుతో ఖచ్చితంగా తమిళ దర్శకులతో పని చేయాలంటే, మహేష్ ఒకటికి రెండు సార్లు ఆలోచించుకునే పరిస్థితి నెలకొంది. ఒక్క మణిరత్నం మినహాయిస్తే… బహుశా మహేష్ కెరీర్ లో మురుగదాసే చివరి తమిళ దర్శకుడు కావచ్చన్నది ట్రేడ్ వర్గాల్లో బలంగా వినపడుతున్న టాక్.

ADVERTISEMENT
Latest Stories