తమిళనాట సంప్రదాయం అయినటువంటి ‘జల్లికట్టు’కు మద్దతు తెలుపుతూ… ఇటీవల ప్రిన్స్ మహేష్ బాబు చేసిన ట్వీట్లు ప్రస్తుతం రాజకీయ రంగు పులుముకుంటున్నాయి. ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే మహేష్, ఈ సారి ఓ సంచలన నిర్ణయం తీసుకుని జల్లికట్టుకు బహిరంగంగా మద్దతు తెలపడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే అప్పటినుండి వాతావరణం చల్లగానే ఉంది గానీ, తాజాగా ‘ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి’ చేస్తోన్న వ్యాఖ్యలతో ప్రిన్స్ ఇరకాటంలో పడ్డారా? అన్న ఆలోచనలకు ఆస్కారం తలెత్తింది.
తమిళనాడు ప్రజలు చేసే జల్లికట్టు ఉద్యమానికి మద్దతు తెలిపిన తెలుగు హీరోలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కాల్సిన ప్రత్యేక హోదాపై ఎందుకు స్పందించరు? అంటూ చలసాని శ్రీనివాస్ ప్రశ్నించారు. ముఖ్యంగా ఇటీవల మహేష్ బాబు జల్లికట్టుకు మద్దతుగా ట్వీట్లు చేసారు కాబట్టి, ఏపీ ప్రత్యేక హోదాపై కూడా మహేష్ బాబు ట్వీట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మహేష్ తో పాటు సినీ, రాజకీయ రంగాలలో ఉన్న చిరంజీవి, పవన్ కళ్యాణ్ వంటి వ్యక్తులు కూడా ప్రత్యేక హోదా కోసం ప్రత్యక్షంగా పోరాడాలని కోరారు.
చూడబోతుంటే… ప్రిన్స్ చేసిన ట్వీట్లు స్వయంకృతాపరాధం కాబోతున్నాయా? అన్న ప్రశ్నలను మిగులుస్తోంది. ముఖ్యంగా రాజకీయ విషయాలలో అస్సలు తలదూర్చని ప్రిన్స్ ను, జల్లికట్టుపై చేసిన ట్వీట్లు ఒత్తిడి పెంచబోతున్నాయా? నిజానికి ‘జల్లికట్టు’ అనేది సంప్రదాయ క్రీడ కాగా, దీనికి రాజకీయాలతో సంబంధం లేదు. కానీ, ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదా కేవలం రాజకీయ పరమైన అంశంగా మారింది. అయితే ఇలాంటి తిప్పల నుండి ఎలా బయటపడాలో ప్రిన్స్ కు తెలుసు అంటున్నారు అభిమానులు.
#M9NewsWin1000 contest every Wednesday – Answer our Question and win Rs 1000 Paytm Gift vouchers pic.twitter.com/0f9fx8dEsN
— M9News (@M9News) January 18, 2017



